BigTV English

Sushmitha Sen: సుస్మితా సేన్‌కు గుండె పోటు

Sushmitha Sen: సుస్మితా సేన్‌కు గుండె పోటు

Sushmitha Sen:బాలీవుడ్ న‌టి సుస్మితా సేన్‌కు గుండె పోటు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా తెలియ‌జేశారు. రెండు రోజుల ముందు సుస్మితా సేన్‌కు గుండె పోటు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆమె ఎమోష‌న‌ల్ పోస్ట్ ద్వారా తెలియ‌జేశారు. మెసేజ్‌తో పాటు తండ్రితో క‌లిసి ఉన్న ఫొటోను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. ‘‘నీ గుండెను ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. క‌ష్ట‌కాలంలో నీకు అది అండ‌గా నిలుస్తుంది అని నాన్న సుబీర్ సేన్ త‌న విలువైన మాట‌ల‌ను చెప్పారు. రెండు రోజుల క్రితం గుండె పోటు వ‌చ్చింది. యాంజియో ప్లాస్టీ పూర్త‌య్యింది. స్టెంట్ కూడా వేశారు. మీ గుండె చాలా గ‌ట్టిది అని నాకు చికిత్స చేసిన డాక్ట‌ర్ అన్నారు. నా హెల్త్ ఎలా ఉంద‌నే విష‌యం నాకు స్నేహితుల‌కు, శ్రేయోభిలాషుల‌కు తెలియాల‌నే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ పెడుతున్నాను. ఇప్ప‌టికైతే ఆరోగ్యంగానే ఉన్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్నాను’’ అని తన మెసేజ్ ద్వారా తెలియజేశారు సుస్మితా సేన్.


తెలుగులో రక్ష‌కుడు, త‌మిళంలో ర‌క్ష‌క‌న్‌గా రూపొందిన సినిమాతో సౌత్ ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించిన సుస్మితా సేన్ త‌ర్వాత బాలీవుడ్‌కే ప‌రిమితం అయ్యారు. స్టార్ హీరోలంద‌రితోనూ న‌టించారు. నాలుగు ప‌దుల దాటిన‌ప్పటికీ ఇంకా వివాహం చేసుకోలేదు. ఓ పాప‌ను ద‌త్త‌త తెచ్చి పెంచుకుంది. కొన్నాళ్ల పాటు వ‌య‌సులో త‌న‌కంటే చిన్న‌వాడైన మోడ‌ల్ రోహ్మ‌న్‌తో రిలేష‌న్‌లో ఉండింది. త‌ర్వాత ఇద్ద‌రూ విడిపోయారు. త‌ర్వాత ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోదీతో సుస్మితా సేన్ రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు వార్తలు వినిపించాయి. త‌ర్వాత వారిద్ద‌రికీ బ్రేకప్ అయ్యింద‌నే న్యూస్ వ‌చ్చింది. రీసెంట్‌గా ఆమె ఆర్య అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ మాధ్య‌మం ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×