Big Stories

Andhra Pradesh : ఏపీ ఎన్నికలు.. పార్టీలకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు?

Andhra Pradesh

Andhra Pradesh : తెలంగాణలో ఎన్నికల వేడి.. నెమ్మదిగా ఏపీకి చేరుతోంది. అన్ని పార్టీలు కూడా పెట్టెబేడా సర్దుకుని ప్రచారాలకు ఎలా వెళ్లాలనే వ్యూహాలు రచిస్తున్నారు. నాయకులు చెప్పేది ప్రజలు వినాలంటే, వారి కాన్ సంట్రేషన్ తమ వైపే ఉండేలా చూడాలి. అలా చేయాలంటే ఆ నాయకుల పక్కన ఎవరో ఒకరు సెలబ్రిటీలు ఉండాలి. అలాంటి వారినే స్టార్ క్యాంపెయినర్లుగా పిలుస్తారు.

- Advertisement -

అందులో సినిమా స్టార్స్, హీరోయిన్స్, క్రికెటర్లు, పలు రంగాల్లో ప్రముఖులు ఇలా ఎందరో ఉంటారు. వారు వస్తే జనాల్లో ఒక అటెన్షన్ వస్తుంది. వారేం చెబుతారా? అని చూస్తారు. లేదా వారి స్పీచ్ వచ్చే వరకు, మిగిలిన వాళ్లు చెప్పినదంతా వింటారు.

- Advertisement -

అలాంటి వారికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఎన్నికల ప్రచారంలో, అభ్యర్థుల ఎంపికలు, బలాబలాలు, సమీకరణాలు, డబ్బు సంచులు, ఇలా అన్నింటా కూడా వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు ప్రతి రాజకీయ పార్టీల నుంచి కూడా ప్రచారంలో స్టార్ క్యాంపెయనర్ల కోసం వెతుకుతున్నారు. తాజాగా కర్ణాటక ఎన్నికల్లో సినిమా తారలు సందడి చేశారు గానీ, తెలంగాణలో మాత్రం పవన్ కల్యాణ్ తప్ప, ప్రముఖ సెలబ్రిటీలు ఎవరూ కనిపించలేదు.

ఈసారి అన్ని పార్టీలు వారిని పక్కన పెట్టి రాజకీయ నాయకులుగా తమ ఇమేజ్ పైనే నడిపించాయి. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్లే తమ భుజస్కంధాలపై మోశారు. విజయశాంతి వచ్చినా, తనకిచ్చిన పాత్ర వరకు పరిమితమయ్యారు.

బీజేపీ దగ్గరికి వస్తే ప్రధాని మోదీ, అమిత్ షా రోడ్ షోలు, ప్రసంగాలు, సభలతో హడావుడి చేశారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆశీర్వాద సభలంటూ కేసీఆర్ నడిపించారు.

ఏపీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆ పార్టీకి పెద్ద స్టార్ క్యాంపెయినర్ గా మారారు. ఇది వాళ్లకి పెద్ద అసెట్ గా మారింది. అలాగే పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఉన్నారు. అలాగే అవసరమైతే ప్రచారానికి వస్తానని మేనల్లుడు సాయితేజ్ అంటున్నాడు. ప్రముఖ కమేడియన్ పృథ్వీ కూడా జనసేన పార్టీలో చేరారు.

తెలుగుదేశం పార్టీ వరకు వస్తే, సినిమా ఇండస్ట్రీ అంతా ఇటే ఉందని అంటారు కానీ పైకి మాత్రం ఒకరిద్దరే కనిపిస్తున్నారు. ఎప్పటిలా పార్టీకి పెద్దదిక్కుగా నారా చంద్రబాబునాయుడు ఎలాగూ ఉన్నారు. హీరో నందమూరి బాలకృష్ణ ఉండనే ఉన్నాడు. వీరికితోడు యువ హీరో నారా రోహిత్ తెలుగుదేశం తరఫున ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 

అలాగే నారా లోకేష్ సతీమణి, బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అంటున్నారని సమాచారం. అవసరమైతే మురళీ మోహన్ లాంటి రిటైర్ఢ్ నాయకులు వస్తారని అంటున్నారు.

క్రికెటర్ అజారుద్దీన్, సినీ నటి దివ్యవాణి, ఒకనాటి రాంగోపాల్ వర్మ హీరోయిన్ ఊర్మిళ, సన్నీడియోల్, శిల్పా షిండే, కన్నడ హీరో శివరాజ్ కుమార్, కన్నడ నటీమణి ఉమాశ్రీ,, రమ్య, ఆ సమయానికి పలువురు వచ్చి ప్రచారం చేసి వెళ్లిపోయేవారున్నారు.

బీజేపీ విషయానికి వస్తే హాస్యబ్రహ్మ…బ్రహ్మానందం, జయసుధ, జయప్రద, సుమలత, నమిత ఉన్నారు. ఎన్నికల సమయంలో కూడా కొందరు వస్తుంటారు. కర్ణాటక ఎన్నికల సమయంలో అలాగే అక్కడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ని తీసుకొచ్చారు. ఇంకా కన్నడ నటిమణులు శ్రుతి, తార, నటులు దర్శన్ ఇలా పలువురు ఉన్నారు.

మంచీ చెడు చెప్పాలంటే 2004లో నాటి అందాల తార హీరోయిన్ సౌందర్య  ఇలాగే బీజేపీ ప్రచారానికి హెలికాఫ్టర్ పై వెళుతూ ప్రమాదవశాత్తూ మరణించింది.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో  సీఎం జగన్మోహనరెడ్డి  స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. అలాగే ఐదు జిల్లాలకు ఒకొక్కరి చొప్పున స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాలని చూస్తున్నట్టు సమాచారం. అలాగే సినీ తెరపై నుంచి వచ్చిన మంత్రి రోజా ఉన్నారు. అలాగే పోసాని కృష్ణ మురళి, ప్రముఖ కమెడియన్ ఆలీ తదితరులు ఉన్నారు.

రేపు ఏపీ ఎన్నికల్లో వీరంతా ఎలా పార్టీ కోసం ప్రచారం చేస్తారు. మార్చి, ఏప్రిల్ అంటే అప్పుడే ఎండలు మొదలవుతుంటాయి. మరి వీరెలా మండుటెండల్లో  పనిచేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News