Big Stories

AP DSC Notification 2024: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్.. పరీక్ష ఎప్పుడంటే..?

AP DSC Notification

AP TET/DSC Notification 2024 Schedule : ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. 6,100 టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

- Advertisement -

టీచర్ పోస్టుల ఖాళీలు ఇలా ఉన్నాయి..

- Advertisement -

ఎస్‌జీటీ పోస్టులు 2,280 ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2,299 ఉన్నాయి. టీజీటీ పోస్టులు 1264, పీజీటీ పోస్టులు 215 ఉన్నాయి. 42 ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

డీఎస్సీ అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు చేసుకోవాలి. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 24న ఆల్ లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి మార్చి 30 వరకు రెండు సెషన్స్ లో డీఎస్సీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మార్చి 31న ప్రాథమిక కీ విడుదలవుతుంది. ఏప్రిల్ 1న కీలో అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News