AP New Scheme: వర్షాకాలం పోయింది.. శీతాకాలం రాబోతోంది. పర్యాటకులకు ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హోం స్టే పథకానికి శ్రీకారం చుట్టింది. హిల్స్ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకి ఇంటిని అద్దెకు ఇవ్వడం అన్నమాట. ఒక్కమాటలో చెప్పాలంటే సొంతింట్లో ఉన్న అనుభూతిని టూరిస్టులు పొందవచ్చు.
హోం స్టే పథకం
ముఖ్యంగా ఏపీలోని ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి, విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలను ఎంపిక చేసింది. వాటిలో అరకులోయ, మారేడుమిల్లి, లంబసింగి వంటి ప్రాంతాలు ఉన్నాయి. మన ఇంటిని పర్యాటక కేంద్రంగా మార్చుకోవడం అన్నమాట. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు మొదలుకానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకంపై ప్రధానంగా ఫోకస్ చేసింది. హోం స్టే పథకం ద్వారా గృహ యజమానులకు ఆదాయం కల్పించడం ప్రధాన ఉద్దేశం. తమ ఇళ్లను పర్యాటకులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందే అవకాశం కల్పిస్తోంది. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు తమ గ్రామాలు లేదా పట్టణాల్లో ఇళ్లను హోం స్టేలకు ఇవ్వవచ్చు. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి వరకు హోం స్టేలు ఏర్పాటు లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
గ్రామీణ టూరిజం
పాత ఇళ్ల ఆధునీకరించేందుకు ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా మెప్మా, సెర్చ్ వాటి ద్వారా రుణాలు అందజేయనుంది. దీనివల్ల స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను పర్యాటకులకు పరిచయం చేసే అవకాశం ఉంది. వచ్చేవారంలో దీనికి సంబంధించిన పోర్టల్ అందుబాటులోకి రానుంది. తొలుత అద్దెకు ఇచ్చే ఇంటి యజమానులను స్థానిక పోలీసుల ద్వారా ధృవీకరణ జరుగుతుంది.
ఆ తర్వాత జిల్లా స్థాయి పర్యాటక కమిటీ ఆమోదం వేయనుంది. సదుపాయాల ఆధారంగా గోల్డ్ లేదా సిల్వర్ కేటగిరీ వర్గీకరిస్తారు. హోం స్టేకు కనీసం ఒక గది ఉండాలి. అంటే రెండు బెడ్స్ ఉండాలి. గరిష్టంగా ఆరు గదులు లేకుంటే 12 బెడ్స్ ఉండాలి. ఇక ఇంటి యజమాని అదే ప్రాంతంలో ఉండాలి. హోం స్టే పథకానికి రాయితీల విషయానికి వద్దాం.
ALSO READ: రైతులకు లాభం దక్కేలా ఏపీ ప్రభుత్వం చర్యలు
ఏడేళ్ల వరకు జీఎస్టీ తిరిగి చెల్లింపు ఉంటుంది. విద్యుత్, నీటి, ఆస్తిపన్ను సడలింపు ఉంటుంది. మూడేళ్లపాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. అంతేకాదు ప్రతీ రెండేళ్ల కొకసారి రెన్యువల్ తప్పనిసరిగా చేయాలి. హోం స్టేలను ఆన్ లైన్‌లో బుకింగ్ ప్లాట్ ఫార్ములు రెడీ అవుతున్నాయి.
వాటిలో ఓయో, మేక్ మైట్రిప్, స్టే విస్తా వంటి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల 50 వేల మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తోంది. అంతేకాదు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి కానుంది. ఆ తరహా పద్దతి ఇప్పటికే చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తే యవతకు ఉపాది అవకాశాలు దక్కనున్నాయి.