Brahmamudi serial today Episode: రాజ్ ను సీతారామయ్య తిట్టగానే.. నాకు ఇప్పుడే బిడ్డలు వద్దు.. ఆ విషయ మీరే కళావతికి చెప్పి ఒప్పించాలి. కానీ నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అంటూ చెప్పి వెళ్ళిపోతాడు. దీంతో ధాన్యలక్ష్మీ విన్నావు కదా కావ్య రాజ్ ఏం చెప్పాడో.. వాడు నిర్ణయం మార్చుకోడంటా..? ఇక ఆలోచించుకోవాల్సింది నువ్వే.. నువ్వు రాజ్ చెప్పినట్టు వినాలి అని చెప్పే హక్కు నాకు లేకపోవచ్చు కానీ ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను ఈ ఇంట్లోంచి వెళ్లిపోతాను. దానికోసం నువ్వేం చేస్తావో నీ భర్తను ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం అంటూ చెప్పి ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది.
కావ్య కూడా ఏడుస్తూ రూంలోకి వెళ్లిపోతుంది. ఏంటి అత్తయ్య వాడు మారాలని మనం ఎంత చేసినా వాడు మారడం లేదు.. చివరికి ఇలా జరిగిందేంటి.. అంటుంది అపర్ణ. నాకేం అర్థం కావడం లేదు అపర్ణ. వాడు మారాలని మనం ప్రయత్నించాం.. వాడు మారడం లేదు.. నా మనవరాలికి బిడ్డను దూరం చేసుకోమని చెప్పలేము.. ఇప్పుడు ఏం చేయాలి అని తల పట్టుకుంటుంది ఇంద్రాదేవి. ఏది జరగాలని కోరుకున్నానో కరెక్టుగా అదే జరిగింది. ధాన్యలక్ష్మీకి చిన్న నిప్పు పెట్టగానే కుటుంబం మొత్తాన్ని తగలేసింది. ఇప్పుడు రాజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.
తర్వాత జ్యూస్ తీసుకుని అప్పు దగ్గరకు వెళ్తాడు. పొట్టి ఇప్పుడు ఏం జరిగిందని అంతలా బాధపడుతున్నావేంటి..? అని అడగ్గానే.. ఇంకా ఏం జరగాలని కూచి ఇందాక అత్తయ్య ఎంత గొడవ చేసిందో ఎన్ని మాటలు అన్నదో నువ్వే విన్నావు కదా..? అసలు మా కావ్య అక్క చేసిన తప్పేంటి కూచి నువ్వే చెప్పు.. కారణం చెప్పకుండా అబార్షన్ చేయించో అంటే ఏ తల్లి అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. తప్పు చేస్తుంది బావ అయితే శిక్ష మా అక్కకా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో తప్పు అన్నయ్యదో వదినదో కాదు.. నీది అంటాడు కళ్యాణ్. దీంతో అప్పు ఏం మాట్లాడుతున్నావు కూచి నేను తప్పు చేశానంటావేంటి..? అని అడుగుతుది. అప్పు..
మరి లేకపోతే ఏంటి పొట్టి అసలు నువ్వే కనక టైంకి ఫుడ్ తీసుకుని రెస్ట్ తీసుకుని ఉంటే ఈ గొడవ జరిగేదా..? నీవల్ల కడుపులో బిడ్డకు ఎమవుతుందోననే అమ్మ అంత గొడవ చేసింది. అంటే ఒక రకంగా ఈ గొడవకు కారణం నువ్వే కదా..? ఇలా అస్తమానం ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా..? అని కళ్యాణ్ అడగ్గానే.. కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే కూచి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు.. ఈరోజు ఎలాగైనా సరే అక్కకు నిజం తెలియాల్సిందే.. ఈ ప్రాబ్లమ్‌కు పులిస్టాప్ పెట్టాల్సిందే.. అంటూ నిజం చెప్పడానికి వెళ్తుంటే.. కళ్యాణ్ ఆపేస్తాడు. వదినకు నిజం తెలిస్తే తట్టుకోలేదనే కదా అన్నయ్య చెప్పకుండా ఆగింది. అన్నయ్య ఎలాగైనా వదినకు తెలియకుండా అబార్షన్ చేయించాలని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు..అన్నయ్య ప్రయత్నం చేస్తా అంటున్నారు కదా చేయనిద్దాం. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు.
మరోవైపు గార్డెన్‌లో కూర్చున్న కావ్య ఇంట్లో జరిగిన గొడవను గుర్తు చేసుకుని బాధపడుతుంది. రాజ్ మాటలు గుర్తు చేసుకుంటుంది. వెంటనే రూంలోకి వెళ్లి లెటర్ రాసి పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోతుంది కావ్య. మరుసటి రోజు పనిమనిష రత్తాలు ఇల్లు శుభ్రం చేస్తూ ఆ లెటర్‌ను బయటకు చీపురుతో తోస్తుంది. ఆ లెటర్ గాలిలో ఎగురుతూ అపర్ణ కాళ్ల దగ్గరకు వెళ్లుంది. లెటర్ చూసిన అపర్ణ తీసుకుని చదువుతుంది. మీరు చెప్పినట్టు వినడానికి నేను సిద్దంగా లేను.. నేను చెప్పినట్టు వినడానికి మీరు సిద్దంగా లేరు.. ఈ టైంలో ఇంట్లో గొడవలు తగ్గడానికి ఒక్కటే పరిష్కారం నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. నా కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి వెళ్తున్నాను అని లెటర్‌లో ఉంటుంది. లెటర్ చదువుతూ.. అపర్ణ షాక్ అవుతుంది. ఇంద్రాదేవి వచ్చి ఏంటది అని తీసుకుని చూసి చదివి ఏంటి కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయిందా..? అనగానే సుభాష్ షాక్ అవుతాడు.
అపర్ణ గట్టిగా కోపంగా రాజ్ అని పిలుస్తుంది. రాజ్ బయటకు రాగానే నువ్వు చేసిన దానికి కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది అని తిడుతుంది. అందరూ షాక్ అవుతారు. అపర్ణ, ఇంద్రాదేవి తిడతారు. ఇంతలో రుద్రాణి అడ్డు పడుతుంది. అయినా అబార్షన్ ఎందుకు చేయించాలనుకున్నాడో చెప్పలేదు అంటుంది. అందరూ కలిసి రాజ్ ను తిట్టి… వీడితో పని లేదు.. కావ్య ఎక్కడికి వెళ్లిందో మనమే వెతుకుదాం అంటుంది ఇంద్రాదేవి.. ఎక్కడ వెతుకుదాం రైలు పట్టాల మీదనా..? హుస్సేన్ సాగర్ లోనా… అంటుంది రుద్రాణి. దీంతో సుభాష్ కోపంగా రుద్రాణిని తిడతాడు. కనకానికి ఫోన్ చేయమని అపర్ణకు చెప్తాడు. కట్ చేస్తే.. కనకం ఇంటికి కావ్య వెళ్తుంది. ఒక్క దానవే వచ్చావేంటి..? అని అడుగుతుంది. నేను ఒక్క దాన్నే వస్తాను ఆకలిగా ఉంది ఏదైనా టిఫిన్ చేయ్ అని అడుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.