Hyderabad: హైదరాబాద్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ప్రాణాలను విడిచింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లాలాగూడ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద నివాసం ఉంటున్న ప్రమోద్ కుమార్ కూతురు మౌనిక(19). తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతుంది. అదే కళాశాలలో వాలీబాల్ కోచ్ అయినటువంటి అంబాజీ.. తనను ప్రేమించమని నిత్యం వేధించడంతో మౌనిక మానసిక వేదనకు గురైంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు.