BigTV English

Mirai Closing Collections: మిరాయ్‌ క్లోజింగ్‌ కలెక్షన్స్‌… లాభం ఎన్ని కోట్లంటే!

Mirai Closing Collections: మిరాయ్‌ క్లోజింగ్‌ కలెక్షన్స్‌… లాభం ఎన్ని కోట్లంటే!

Mirai Movie Closing Collection: ఈ ఏడాది విడుదలైన తెలుగు చిత్రాల్లో థియేటర్లలో అబ్బురపరిచిన చిత్రం ‘మిరాయ్‌’. హనుమాన్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం తర్వాత తేజ సజ్జా నటించిన ఈ చిత్రమిది. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అంతకు మించి రెస్పాన్స్‌ అందుకుంది. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్‌ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సెప్టెంబర్‌ 12న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తెలుగు బాక్సాఫీసు భారీ ఒపెనింగ్స్‌ ఇచ్చింది.


భారీ ఒపెనింగ్స్‌తో మొదలై..

ఫస్ట్ డే ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 27.20 కోట్ల గ్రాస్‌ వసూల్లు చేసింది. రూ. 12 కోట్లనెట్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ తర్వాత మూవీ హిట్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ మరింత పెరిగాయి. దీంతో ఫస్ట్‌ డే కంటే సెకండ్‌ డే కలెక్షన్స్‌ మరింత పెరిగాయి. అలా మౌత్‌ టాక్‌తో థియేటర్లలో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతూ నిర్మాతలను లాభాల బాట పట్టించింది ఈ చిత్రం. ప్రస్తతం థియేట్రికల్‌ రన్‌ పూర్తి చేసుకుని ఓటీటీ విడుదలకు కూడా సిద్దమైంది. ఈ క్రమంలో మిరాయ్‌ మూవీ క్లోజింగ్‌ కలెక్షన్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. మిరాయ్‌ బాక్సీఫీసు క్లోజింగ్‌ కలెక్షన్స్‌ ట్రెడ్‌ వర్గాలను సైతం సర్‌ప్రైజ్‌ చేస్తున్నాయి. వరల్డ్‌ వైడ్‌ ఈ చిత్రం రూ. 143.6 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసింది. కేవలం ఇండియాలోనే రూ. 110 కోట్లకు పైగా గ్రాస్‌ రాబ్టటింది. మొత్తం రూ. 92 కోట్ల నెట్‌ రాబట్టి నిర్మాతలకు లాభాలు ఇచ్చింది.

కలెక్షన్స్‌ డిటైయిల్స్‌

తెలుగు లో ఈ చిత్రం రూ. 73.38 కోట్ల నెట్‌, హిందీలో- రూ. 16.82 కోట్లు నెట్‌, తమిళ్‌- రూ. 0.90 కోట్లు, కన్నడ-రూ. 0.63 కోట్లు, మలయాళంలో రూ. 0.2డి నెట్ కలెక్షన్స్‌ చేసినట్టు ట్రెడ్‌ వర్గాలు నుంచి సమాచారం. మొదటి వారం మిరాయ్‌ ఊహించన విధంగా రూ. 77 కోట్ల నెట్‌ రాబట్టి మొదటి వీక్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. అలా రెండో వారం రూ. 22 కోట్ల నెట్‌, మూడో రూ. 9 కోట్ల నెట్‌లో కలెక్షన్స్‌ చేసింది. ఇలా మిరాయ్‌ ఈ క్లోజింగ్‌ కలెక్షన్స్‌ ప్రకారం ఈ సినిమా ద్వారా నిర్మాతలు రూ. 40 కోట్ల ప్రాఫిట్‌ పొందారు. వరల్డ్‌ వైడ్‌ రూ. 143.6 కోట్ల గ్రాస్‌‌ చేసిన ఈ చిత్రం కేవలం ఇండియా వైడ్‌గా రూ. 108 కోట్ల గ్రాస్‌ చేసింది. రూ. 92 కోట్ల నెట్‌ రాబట్టింది.


Also Read: Saife Ali Khan: ఆ రోజు నా కొడుకుపై కూడా దాడి చేశాడు,  సైఫ్‌ షాకింగ్‌ కామెంట్స్

బిజినెస్‌ లెక్కలు ఇలా..

మూవీ బడ్జెట్ విషయానికి వస్తే మిరాయ్‌ని రూ. 60 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. విడుదలకు ముందే శాటిలైట్‌, ఓటీటీ, థియేట్రికల్‌ రైట్స్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. నైజాంలో రూ. 7 కోట్లు, ఆంధ్ర- రూ. 8కోట్లు, సీడెడ్‌ రూ. 3 కోట్లు బిజినెస్‌ జరిగింది. అలాగ కర్ణాటక రూ. 2 కోట్లు, తమిళనాడు రూ. 2 కోట్లు, కేరళ-రూ. 50 లక్షలు, హిందీ- రూ. 10.5 కోట్లు, ఓవర్సిస్‌లో రూ. 6 కోట్లు బిజినెస్‌ జరిగినట్టు సమాచారం. మొత్తంగా మిరాయ్‌ విడుదలకు ముందే సుమారు రూ. 39 కోట్ల పైగా బిజినెస్‌ జరుపుకుంది. నాన్‌ థియేట్రికల్‌ లెక్కలతో విడుదలకు ముందే మిరాయ్‌ మూవీ పెట్టిన బడ్జెట్‌ వచ్చేసింది. థియేట్రికల్‌ రన్‌తో ఈ సినిమా రూ. 40 కోట్ల లాభాలు తెచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలకు ఊహించని లాభాలు ఇచ్చింది. ప్రస్తుతం మిరాయ్‌ క్లోజింగ్‌ కలెక్షన్స్‌ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను సర్‌ప్రైజ్‌ చేస్తున్నాయి.

Related News

Trisha: పెళ్లే కాదు హనీమూన్‌ డేట్‌ కూడా ఫిక్స్‌… పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్‌

VDKola : రౌడీ సినిమాకు విముక్తి, రాజుగారు రంగంలోకి దిగుతున్నారు

Meesala pilla song: మీసాల పిల్ల పాటపై అనిల్ రావిపూడి అప్డేట్.. బుల్లి రాజు ఓవరాక్షన్ భరించలేం రా బాబు!

Ramgopal Varma: శివ రీ రిలీజ్..36 ఏళ్లకు అర్థమైందంటున్న ఆర్జీవీ!

SSMB 29 Title : జక్కన్న ఏంటీ ఈ ఘోరం.. ఆ టైటిల్స్ మీరే లీక్ చేశారా ?

Shivaji: వామ్మో శివాజీ ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారా… అన్ని సూపర్ హిట్టే!

Funky Teaser Review : సాలిడ్ కం బ్యాక్ మామ, ప్యూర్ అనుదీప్ స్టఫ్, నవ్వులే నవ్వులు

Suniel Shetty: కన్నీళ్లు, గర్వం, గూస్‌బంప్స్‌ ఒకేసారి.. ‘కాంతార’ మూవీపై బాలీవుడ్‌ నటుడు రివ్యూ!

Big Stories

×