Fire Incident: ప్రకాశం జిల్లా కె.బిట్రగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బికె థ్రెషర్స్ పొగాకు కంపెనీ గోడౌన్‌లో పొగాకు బేళ్లు దగ్ధం అవుతున్నాయి. మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది.
బికె థ్రెషర్స్ పొగాకు కంపెనీలో ప్రమాదం
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలోని బికె థ్రెషర్స్ లో పోగాకు కంపెనీలో అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో కోట్లల్లో ఆస్తి నష్టాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: నేడు తెలంగాణ మొత్తం బంద్..! కారణం ఏంటంటే..
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఈ బికె థ్రెషర్స్ గోడౌన్‌లో పొగాకు భారీగా నిల్వ ఉండటం.. అంతేకాకుండా పొగాకు తయారికి సంబంధించిన కేమికల్స్ ఫైర్ ఉండటం వల్ల ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ అగ్నిప్రమాదం పొగాకు నిల్వ ఉండటం వల్ల జరిగిందా.. ? లేదా వేరే ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా కే.బిట్రగుంటలో భారీ అగ్ని ప్రమాదం..
బీకే థ్రెషర్స్ పొగాకు కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
గోడౌన్ లో తగలబడిన పొగాకు బేళ్ళు
మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/5l5KrBeBum
— BIG TV Breaking News (@bigtvtelugu) October 10, 2025