IPL Auction 2026: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) ప్రారంభం కంటే ముందు మినీ వేలంకు ( IPL 2026 AUCTION ) సంబంధించి తేదీలు ఖరారు అయినట్లు చెబుతున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుంచి 15వ తేదీలలో 2026 కు సంబంధించిన వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా ఆ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మినీ వేలం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన చాలామంది ప్లేయర్లను వదిలివేయనున్నట్లు తెలుస్తోంది. అటు రాజస్థాన్ జట్టుకు సంబంధించిన ప్లేయర్లను కూడా వదిలేస్తున్నారట.
Also Read: IND-W vs SA-W: కొంపముంచిన హర్మన్.. దక్షిణాఫ్రికా విక్టరీ..పాయింట్ల పట్టికలో టీమిండియా సేఫ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మినీ వేలానికి సంబంధించిన కీలక అప్డేట్ వైరల్ గా మారింది. వచ్చే సీజన్ ప్రారంభాని కంటే ముందు ఐపీఎల్ మినీ వేలం నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావిస్తోంది. డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15వ తేదీ మధ్యలో ఐపిఎల్ 2026 కు సంబంధించిన మినీ వేలాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారట. అయితే ఈవెంట్ విదేశాల్లో నిర్వహించాలా ? లేదా ముంబైలో నిర్వహించాలా ? అనే దాని పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
2023 లో జరిగిన వేలం దుబాయిలో జరగగా 2024 మెగా వేలం జెడ్డా వేదికగా నిర్వహించారు. ఈ సారి మాత్రం ఇండియాలో అది కూడా ముంబైలో జరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది. ఇక నవంబర్ 15వ తేదీ లోపు రిటెన్షన్ లిస్టును అన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ఆ లోపు ఎవరిని తొలగించాలి ? ఎవరిని అట్టిపెట్టుకొని ఉండాలి ? అనే దాని పైన 10 ఫ్రాంచైజీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇక డిసెంబర్ లో వేలం జరుగుతుంది. ట్రెడింగ్ రూల్ ఉంటుంది. దీనికి ప్రకారం, ఒక జట్టు నుంచి మరో జట్టుకు ప్లేయర్లను ఎక్స్ ఛేంజ్ చేసుకోవచ్చు.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో దాదాపు సగం మంది ప్లేయర్లను వదిలేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ లిస్టులో విజయ్ శంకర్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, సామ్ కరణ్, కాన్వేలు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి యంగ్ క్రికెటర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇటీవలే అశ్విన్ రిటైర్ కావడంతో చెన్నై పర్సులోకి 9.75 కోట్లు యాడ్ అయిన సంగతి తెలిసిందే. ఆ డబ్బులతో మరో ఆల్‌రౌండర్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంజూ శాంసన్ కూడా రాజస్థాన్ ను వదిలి, ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా చెన్నైలోకి వస్తాడని అంటున్నారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ఆకాష్ దీప్, మయాంక్ యాదవ్ అలాగే డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్లు ఈ సారి వేలంలోకి వస్తారని చెబుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు ఆడం జంపా, రాహుల్ చాహర్ లాంటి వాళ్లను తొలగించే ఆలోచనలు కావ్య పాప ఉన్నట్లు తెలుస్తోంది.
🚨 UPDATE ON IPL 2026 AUCTION 🚨 (Cricbuzz).
– The Auction is likely to happen 13-15 Windows.
– 15th November is the deadline for IPL retentions.
– CSK is likely to release Curran, Hooda, Tripathi, Conway & Vijay Shankar. pic.twitter.com/CbnaR7GzVo
— Tanuj (@ImTanujSingh) October 10, 2025