Rain Alert: ఆగ్నేయ బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు కోస్తా, రాయలసీమలో కూడా వానలు పడుతున్నాయి. తిరుమలలో నిన్న ఉదయం కురుస్తున్న వర్షాలతోటి అతలాకుతలం అవుతున్న పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో రానున్న మూడు రోజు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రత ఉండటంతో పాటు.. అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నెలాఖరు వరకు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ స్థాయికి పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఉదయం నుంచి నాన్ స్టాప్‌గా వానలు పడుతున్నాయి. రాబోయే గంటల్లో ఉరుములతో కూడిన ఎడతెగని వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందని పేర్కొన్నారు.
అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు మొదలవుతాయని అంచనా. కడప, రాజంపేట, మదనపల్లె ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
విశాఖపట్నం నగరంలో రాత్రిపూట మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.
Also Read: నార్శింగ్‌లో విషాదం.. చెరువులో మునిగి అమ్మమ్మ, మనవరాలు మృతి
రేపు ఉదయం ప్రకాశం, బాపట్ల, కృష్ణా తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో.. తీర ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.