BigTV English

AP permit rooms 2025: ఏపీ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈ సౌకర్యం మీకోసమే!

AP permit rooms 2025: ఏపీ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈ సౌకర్యం మీకోసమే!

AP permit rooms 2025: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు మరోసారి పాత రోజులు గుర్తొచ్చే అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మద్యం దుకాణాల లోపలే తాగడానికి ప్రత్యేక గదులు ఉండేవి అవే పర్మిట్ రూమ్స్. అయితే, వాటిని రద్దు చేసిన తర్వాత బహిరంగంగా తాగడం పెరిగి, మద్యం ప్రియులకు అసౌకర్యంగా మారింది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మళ్లీ పర్మిట్ రూమ్స్‌ను మంజూరు చేయడానికి సిద్ధమవుతోంది.


తాజా సమాచారం ప్రకారం, ఈ పర్మిట్ రూమ్స్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగడాన్ని నియంత్రించేందుకు, క్రమపద్ధతిలో మద్యం సేవించే వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలనుకునే మద్యం షాపులకు కొత్తగా ఫీజులు కూడా నిర్ణయించారు. నగరాల్లో ఈ గదులకు లైసెన్స్ తీసుకోవాలంటే రూ. 7.5 లక్షలు చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 5 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఆశిస్తున్న వార్షిక ఆదాయం రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

ఈ నిర్ణయం ద్వారా రెండు ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బహిరంగ మద్యం సేవనాన్ని తగ్గించడం, పౌరులకి కలిగే అసౌకర్యాలను నివారించడం, ప్రభుత్వానికి వాణిజ్య ఆదాయాన్ని పెంచడంగా చెప్పవచ్చు.


ఇప్పటివరకు పర్మిట్ రూమ్స్ లేకపోవడం వల్ల మద్యం తీసుకున్నవారు బహిరంగ ప్రదేశాల్లో, రోడ్డు పక్కన, పార్కుల వద్ద లేదా వాహనాల్లోనే తాగుతూ కనిపించేవారు. ఇది సాధారణ ప్రజల జీవనశైలిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ప్రయాణిస్తున్న చోట్ల ఇబ్బందికర దృశ్యాలు వెల్లివిరిచాయి. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఒక నియంత్రిత వాతావరణంలో మద్యం సేవించే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తోంది.

అంతేకాదు, పర్మిట్ రూమ్‌లకు కచ్చితమైన నిబంధనలు ఉండనున్నాయి. అక్కడ స్వచ్ఛత, భద్రత, తాగునీరు, శౌచాలయ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలన్న షరతులు విధించే అవకాశం ఉంది. అలాగే 21 ఏళ్లు నిండినవారికే ప్రవేశం, మహిళలకు ప్రత్యేక చర్యలు, రాత్రి సమయాల్లో పరిమితులు వంటివి కూడా ఈ విధానంలో భాగమయ్యే అవకాశం ఉంది.

Also Read: 40 Years once rice: 40 ఏళ్లకు ఒకసారి పండే బియ్యం.. ఇవి తింటే కొండలు పిండి చేస్తారట!

ఈ నిర్ణయంపై ఇప్పటికే మద్యం షాపులు కలిగిన వాణిజ్యవేత్తలు సానుకూలంగా స్పందిస్తున్నారు. రెవెన్యూ పెరుగుతుందని ఆశిస్తూ ఇప్పటికే అనేక దుకాణాలు పర్మిట్ రూమ్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు పౌరసంఘాలు మాత్రం ఈ చర్య పుణ్యంగా మద్యం సేవనానికి మరింత ప్రోత్సాహం లభించబోతుందని చర్చ మొదలుపెట్టాయి.

అయితే ప్రభుత్వం తలపెట్టినది పబ్లిక్ సమస్యను నివారించడమే అయినప్పటికీ, దీని అమలులో స్పష్టమైన నియంత్రణలు ఉండకపోతే, లైసెన్స్ ఉన్న చోట్ల మద్యం సేవనమే కాక, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీయవచ్చన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి, పర్మిట్ రూమ్‌లు మళ్లీ అందుబాటులోకి రావడం మద్యం సేవించే వారి కోసం సౌకర్యంగా మారుతుందో లేక మరో ముళ్లబాట అవుతుందో, అది మాత్రం త్వరలోనే తేలనుంది. కానీ ప్రభుత్వానికి మాత్రం ఇది రెవెన్యూ పెంపు దిశగా ప్రయోజనాన్ని తీసుకొచ్చే పథకంగా మారనుంది.

Related News

Conaseema: కేశనపల్లిలో కొబ్బరి చెట్లు మాయం.. కారణం ఏమిటంటే?

Kakinada District: యముడు లీవ్‌లో ఉన్నాడు.. లారీ గుద్దినా బతికిపోయాడు, ఇదిగో వీడియో

Cough Syrup: ఆ కల్తీ దగ్గు మందు ఏపీలో సరఫరా కాలేదు.. మందుల నాణ్యతపై నిఘా: మంత్రి సత్యకుమార్

Nara Lokesh: ఏపీలోని ఈ నగరాల్లో ఇంజినీరింగ్ సెంటర్లు.. టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ

AP: KGHలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనితా

AP Fake Liquor case: తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కీలక మలుపులు

CM Progress Report: సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్.. పేరిట ఇంటింటికి సీఎం భరోసా..

Kurupam Incident: కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

Big Stories

×