BigTV English

North Korea: నార్త్ కొరియాలో బీచ్ రిసార్ట్ ప్రారంభం.. టూరిస్టుల కోసమేనట, నమ్మొచ్చా?

North Korea: నార్త్ కొరియాలో బీచ్ రిసార్ట్ ప్రారంభం.. టూరిస్టుల కోసమేనట, నమ్మొచ్చా?

ఉత్తర కొరియా. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకంగా ఉన్న దేశం. ఆ ప్రత్యేకతకు కారణం ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్. అవును, కిమ్ తీసుకునే సంచలన నిర్ణయాలు ఉత్తర కొరియాను ప్రపంచ పటంలోనే స్పెషల్ గా నిలబెట్టాయి. కరోనా టైమ్ లో కిమ్ ఇతర దేశాలతో సరిహద్దుల్ని మూసివేశాడు. ఒకరకంగా ఆ చర్య ఉత్తర కొరియాను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. అదే సమయంలో విదేశాలనుంచి వ్యాక్సిన్ చేరవేతను కూడా ఆలస్యం చేసింది. ఇక పర్యాటక రంగం గురించి వేరే చెప్పక్కర్లేదు. ఉత్తర కొరియా పర్యాటక రంగం పూర్తిగా పడకేసింది. కరోనా తర్వాత ఇతర దేశాలన్నీ ఆంక్షలు సడలిస్తుండగా కిమ్ మాత్రం ఇంకా మంకుపట్టు వీడలేదు. తమ దేశంలోకి ఎవరూ రావొద్దని, తమ దేశం నుంచి కూడా ఎవరూ ఇతర దేశాలకు వెళ్లకూడదని ఆంక్షలు పెట్టారు. దీంతో భారత్ వంటి దేశాలు కూడా ఉత్తర కొరియాకు తమ రాయబారులను పంపించలేకపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే కిమ్ మనస్తత్వం మారుతోందని అంటున్నారు. దీనికి సాక్ష్యంగా బీచ్ రిసార్ట్స్ ని చూపిస్తున్నారు.


బీచ్ రిసార్ట్స్ ప్రారంభం

ఇటీవల ఉత్తర కొరియాలో బీచ్ రిసార్ట్స్ లు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. దేశీయంగా పర్యాటకులు సముద్ర తీరాలకు వచ్చి సేదతీరుతున్నారు. వాటర్ పార్క్స్ వంటి వాటి సంఖ్య పెరుగుతోంది. అయితే అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడానికి వీటిని తిరిగి పునరుద్ధరిస్తున్నారా, లేక కేవలం దేశీయంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికే ఈ ఏర్పాట్లు చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.


20వేల మందికి వసతి

నార్త్ కొరియాలో కొత్తగా ప్రారంభించిన వోన్సాన్-కల్మా తూర్పు తీర పర్యాటక ప్రాంతంలో విదేశీ పర్యాటకుల ప్రవేశంపై నిషేధం ఉంది. అయితే ఈనెలాఖరులో రష్యా నుంచి వచ్చే అతిథులను స్వాగతించడానికి వోన్సాన్ కల్మా కోస్టల్ టూరిస్ట్ ఏరియా రిసార్ట్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. “ఉత్తర కొరియా వైకికి” అని పిలిచే ఈ భారీ బీచ్ రిసార్ట్ లో దాదాపు 20వేల మందికి వసతి ఏర్పాట్లు ఉన్నాయి. ఇంత భారీ ఏర్పాట్లు ఉన్నా, ఇప్పుడది ఖాళీగా దర్శనమిస్తోంది. ప్రస్తుతానికి లోకల్ పర్యాటకులు మాత్రమే అక్కడికి వెళ్తున్నారు. విదేశీ పర్యాటకుల్ని అనుమతిస్తే నార్త్ కొరియాకు ఆదాయం పెరిగే అవకాశముంది. అయితే కిమ్ అంత తేలిగ్గా మారతాడా లేదా అనేది తేలాల్సి ఉంది.

కిమ్ కూడా ఒప్పుకోవాల్సిందే..

ఉత్తర కొరియా దేశ సరిహద్దుల్ని పూర్తి స్థాయిలో తిరిగి తెరిచేందుకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. లోకల్ మీడియా ప్రకారం, ప్రస్తుతం వోన్సాన్ కల్మా ప్రాంతం పర్యాటకులతో నిండిపోయింది. గతవారం దీన్ని ప్రారంభించిన కిమ్, ఈ ఏడాది విజయాల్లో ఇది ఒకటి అవుతుందన్నారు. ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి విధానాన్ని సాకారం చేసుకునే దిశగా గర్వకారణమైన తొలి అడుగుగా దీన్ని అభివర్ణించారాయన. గతేడాది నుంచి రష్యా పర్యాటకుల్ని పరిమిత సంఖ్యలో ఉత్తర కొరియాలోకి అనుమతిస్తున్నారు. అయితే వీరికి కూడా అన్ని ప్రాంతాలను సందర్శించే అనుమతి లేదు. రాజధాని ప్యాంగ్యాంగ్ లోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశస్తుల్ని అనుమతించడం లేదు. భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ఈ నిషేధం అమలులో ఉందని అంటున్నారు. అయితే దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కిమ్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

Crime News: ఉన్నట్టుండి.. స్నేహితుడిని రైలు కిందకు తోసేసిన ఫ్రెండ్.. అసలు సంగతి తెలిసి షాక్!

Festival Special Trains: చర్లపల్లి నుంచి 22 ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో రైల్వే గుడ్ న్యూస్!

Train Accident: బస్సును ఢీకొట్టిన రైలు, 10 మంది స్పాట్ డెడ్!

Indian Train In Africa: ఆఫ్రికాలో మేడ్ ఇన్ ఇండియా రైళ్లు.. అచ్చం వందేభారత్‌ లాగే ఉన్నాయిగా!

Indian Railways: రైల్వే టికెట్లపై వీరికి 100 శాతం డిస్కౌంట్, కారణం ఏంటంటే?

Potatoes in Plane: ఆ విమానంలోని సీట్ల నిండా బంగాళ దుంపల బస్తాలు వేశారు.. ఎందుకో తెలుసా?

Big Stories

×