Vanitha Vijaykumar:నటి వనితా విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ నటుడు విజయ్ కుమార్ ముద్దుల తనయగా ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. 1995లో తమిళంలో విడుదలైన చంద్రలేఖసినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. తెలుగులో దేవి అనే సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అన్నీ మంచిగా ఉంటే ఆమె కూడా తండ్రి చాటు బిడ్డగా ఎదిగేదేమో. కానీ, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. తండ్రి ఉన్నా, చెల్లెళ్లు ఉన్నా ఆమె ఒంటరిగానే బ్రతుకుతుంది. దానికి కారణం కూడా వనితానే అని చెప్పుకోస్తారు.
విజయ్ కుమార్ భార్య, నటి మంజుల బ్రతికి ఉన్నంతవరకు ముగ్గురు కూతుళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. ఆమె మరణించాక వనితను మిగతవారు బయటకు గెంటేశారు. డబ్బులను ఖర్చుపెట్టడం, ప్రేమ, పెళ్లి అనుకుంటా వేరొకరితో ఉండడం లాంటివి చేయడంతో తండ్రి సైతం ఆమెను పక్కన పెట్టేశాడు. ఇక వనితా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. బిడ్డ కోసం కోర్ట్ కి ఎక్కింది. అప్పుడు కూడా తన ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదనిఆవేదన వ్యక్తం చేసింది. అలా ఎన్నోసార్లు కుటుంబంపై ఎన్నో ఆరోపణలు చేసింది. తనను ఇంటి నుంచి గెంటేశారని, ఆస్తి ఇవ్వడం లేదని.. ఇలా ఎన్నో ఆరోపణలు చేసింది. దీంతో విజయ్ కుమార్ వనిత పేరు ఎత్తినా మండిపడే స్టేజీకి వచ్చాడు.
ఒకరి తరువాత ఒకరిని మార్చుకుంటా వనిత ఈ మధ్యనే నాలుగో పెళ్లి చేసుకుంది.కొరియోగ్రాఫర్ రాబర్ట్ రాజ్ ను ఆమె గతేడాది వివాహం చేసుకుంది. ఇక మధ్య మధ్యలో కినిమాలు చేస్తున్న వనిత కూతురు జోవికా బిగ్ బాస్ తమిళ్ లో సందడి చేసి మంచి పేరు తెచ్చుకుంది. సినిమాల్లో మంచి పాత్రల్లో నటించడమే కాకుండా ఇప్పుడు నిర్మాత గా డెబ్యూ ఇవ్వబోతుంది. వనితా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిసెస్ అండ్ మిస్టర్. ఈ సినిమాలో వనితనే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా జులై 11 న ప్రేక్షకుల ముందకు రానుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగావరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న వనిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఒక నటుడుతో తనకు ఎఫైర్ అంటగట్టినా హీరో విజయ్ చూసిచూడకుండా ఉండడం తనను బాధించిందని తెలిపింది. “చంద్రలేఖ సినిమాతో నేను కేరర్ ను ప్రారంభించాను. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా చేసేటప్పుడు నాకు 15 ఏళ్లు. ఇక అప్పుడే నాతో పాటు నటిస్తున్న 40 ఏళ్ల రాజ్ కిరణ్ తో నాకు ఎఫైర్ ఉందని వార్తలు రాశారు. ఆ వార్తలు చూసి నేను తట్టుకోలేకపోయా.. అందరిముందు సెట్ లోనే ఏడ్చేశాను. నేను ఏడవడం చూసిన విజయ్.. కనీసం పలకరించకుండా వెళ్ళిపోయాడు.
ఇక కొద్దిసేపటి తరువాత మళ్ళీ తిరిగివచ్చి ఏమైంది అని అడిగాడు. నేను నా బాధను మొత్తమం వెళ్లగక్కాను. అప్పుడు విజయ్ నాతో ఒక మాట చెప్పాడు. నీ గురించి ఇలాంటి పుకార్లు రాకపోతే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నా లేనట్లే. ఏదోకటి రాస్తున్నారు అంటే నువ్వు ఫేమస్ అయ్యినట్టే. ఇలాంటివి వస్తుంటాయి. వీటి గురించి నువ్వు బాధపడకు. సినిమలపై ఫోకస్ పెట్టు అని చెప్పాడు. ఆయన ఎప్పుడు అంతే. మొత్తం కనుక్కున్నాకే వచ్చి ఓదారుస్తాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.