Andhrapradesh rain forecast: ఏపీలో ఈ రోజు, రేపు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడుకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఈ కారణంతో ఇప్పటికే బుధ, గురు వారాలు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ అప్పపీడనం కాస్త బలహీనపడినప్పటికీ నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Also read:కేసీఆర్ నీ కంట కన్నీరైనా వచ్చిందా.. 21 ఏళ్లకే ఎమ్మేల్యే గా పోటీకి ఛాన్స్.. సీఎం రేవంత్ రెడ్డి
అంతే కాకుండా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవగా నేడు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నేడు గుంటూరు, బాపట్ల, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, అనంతపూర్, సత్యసాయి జిల్లాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. అదేవిధంగా అల్లూరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.