Bigg Boss 8 Telugu Elimination: తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కొనసాగుతుంది. ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో 12 మంది ఎలిమినేట్ అయ్యారు.. అయితే 11 వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ వారం హౌస్ లో కొనసాగుతున్న వారంతా కూడా టాప్ కంటెస్టెంట్స్.. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం నామినేషన్ లో ఐదుగురు ఉన్నారు. బిగ్ బాస్ ఆట పదోవారానికి చేరిందంటే దాదాపు కథ క్లైమాక్స్‌కి వచ్చేసినట్టే. మిగిలిన ఐదు వారాలు ఫ్యామిలీ వీక్.. వీకెండ్.. జర్నీ వీడియోలతోనే లాక్కొచ్చేస్తారు కాబట్టి కొత్తగా ఇకపై ఆడేదేం ఉండదు. ఆల్రెడీ హౌస్‌లో ఉన్న వాళ్లు ఆడాల్సిన ఆట ఆడేశారు.. ఇక ఓటింగ్ ను బట్టి ఇక విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తారు.. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనేది సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒకసారి చూద్దాం..
పది వారాలకు 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం హౌస్‌లో విష్ణు ప్రియ, ప్రేరణ, యష్మీ గౌడ, రోహిణి, అవినాష్, టేస్టీ తేజా, నబీల్, పృథ్వీ, నిఖిల్, గౌతమ్ ఈ పది మంది ఉన్నారు. మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. వీళ్లంతా తెలుగువాళ్లే కావడం ఇక్కడ విశేషం.. కొంతలో కొంత రచ్చ చేస్తున్నది వీళ్ళే.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న పది మందిలో ఈవారం నామినేషన్స్‌లో ఉన్నది ఆరుగురు. యష్మీ గౌడ, అవినాష్, టేస్టీ తేజా, పృథ్వీ, విష్ణు ప్రియ, గౌతమ్‌లు నామినేషన్స్‌లో ఉన్నారు..
ఈ వారం ఓటింగ్ ను బట్టి సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇక ఈ వారం హౌస్ లో ఓటింగ్ రసవత్తరంగా సాగుతుంది. ఇకపోతే మొన్నటి వరకూ అయితే విన్నర్ రేస్‌లో నిఖిల్ పేరు వినిపించింది కానీ.. ఎప్పుడైతే అతని కన్నడ గ్రూపిజం బయటపడిందో అప్పటినుంచి నబీల్‌ని సైతం ఫినాలేకి రాకుండా చేయాలని కుట్రలు పన్నాడో.. ఎవిక్షన్ షీల్డ్ విషయంలో మనోడి ఫ్లిప్పింగ్‌లు.. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఇలాంటి వాడ్నా విన్నర్‌ని చేసేది అని ఆలోచనలో పడ్డారు.. ఇక ఫ్యామిలీ వీక్ ఒక్కొక్కరు పేరెంట్స్ రావడంతో కాస్త హ్యాపిగా ఫీల్ అవ్వడంతో పాటుగా బూస్ట్ ను ఇచ్చి వెళ్లారు..
ఇదిలా ఉండగా ఈ వారం హౌస్ నుంచి పృథ్వి, విష్ణు ప్రియలు ఎలిమినేట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిన్నటివరకు విష్ణు ప్రియా ఎలిమినేట్ అవుతారా అని ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. ఏ పోల్ చూసినా కూడా గౌతమ్ టాప్ ఓటింగ్‌తో దూసుకునిపోతున్నాడు. ఇక తన తప్పు లేకపోయినా శిక్షించబడ్డ టేస్టీ తేజా అనూహ్యంగా టాప్ 5 రేస్‌లోకి వచ్చేశాడు. అతను సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. గత వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న యష్మీ ఇప్పుడు ఓటింగ్ లో దూసుకుపోతుంది. యష్మీతో పాటు పృథ్వీ, విష్ణు ప్రియలు డేంజర్ జోన్‌లోకి వచ్చారు. అయితే ఆసక్తికరమైన పరిణామం పృథ్వి డేంజర్ జోన్ లో ఉన్నారు.. అంటే ఈ వారం పృథ్వి బయటకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మరి ఎవరు వెళ్తారో తెలియాలంటే ఈ వీకేండ్ ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..