BigTV English

Anganwadi Strike : సమ్మె విరమించిన అంగన్వాడీలు.. నేటి నుంచి విధులకు హాజరు..

Anganwadi Strike : రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు , హెల్పర్తు సమ్మె విరమించారు. సమ్మె విరమిస్తున్నామని ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ వెల్లడించారు. మంగళవారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరె్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. అంగన్వాడీ డిమాండ్‌లను నేరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Anganwadi Strike : సమ్మె విరమించిన అంగన్వాడీలు.. నేటి నుంచి విధులకు హాజరు..
AP Breaking news today

Anganwadi Strike update(AP breaking news today):

రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు , హెల్పర్తు సమ్మె విరమించారు. సమ్మె విరమిస్తున్నామని ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ వెల్లడించారు. మంగళవారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరుగగా.. అంగన్వాడీల డిమాండ్‌లను నేరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.


చర్చలు సానుకూలంగా జరిగాయని మంత్రి తెలిపారు. అయితే వేతనాలు పెంపు జూలై నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారని అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి తెలిపారు. జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారని ఆయన తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్‌ను కూడా పెంచుతామని హామీ ఇచ్చారని ప్రకటించారు.
అంగన్వాడీ డిమాండ్‌లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. త్వరలోనే అగన్వాడీలకు వైఎస్ఆర్ బీమా, అంగన్వాడీ బీమా అమలు చేస్తామన్నారని ప్రకటించారు.

అంగన్వాడీ వర్కర్ల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు. టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుండి వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుందని పేర్కొన్నారు. సమ్మె కాలానికి పూర్తి జీతం చెల్లిస్తామన్నారని ప్రకటించారు. సమ్మె చేసిన అంగన్వాడీ‌లపై కేసులు నమోదు చేశారని వాటిని ఎత్తివేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించినట్లు ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×