BigTV English

Ap Assembly: అయ్యన్నపాత్రుడు 40ఏళ్లుగా పసుపు జెండా మోస్తున్నారు.. అసెంబ్లీలో చంద్రబాబు

Ap Assembly: అయ్యన్నపాత్రుడు 40ఏళ్లుగా పసుపు జెండా మోస్తున్నారు.. అసెంబ్లీలో చంద్రబాబు

Ap Assembly Meeting updates(Andhra pradesh political news): ఏపీ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభాపతి స్థానానికి తీసుకొచ్చారు. బీఏ పూర్తి చేసిన ఆయన.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


ఏడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన అయ్యన్నపాత్రుడు.. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 10 సార్లు అసెంబ్లీ, రెండు సార్లు పార్లమెంట్‌కు పోటీ చేశారు. ఐదు సార్లు రాష్ట్ర మంత్రిగా పదవులు చేపట్టారు. 1996, 1998లో పార్లమెంట్‌కు పోటీ చేయగా.. 1996లో గెలిచారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడకి నాలుగు దశాబ్ధాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది.1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. వివిధ శాఖల్లో మంత్రులుగా పరిచేశారు. సాంకేతిక విద్య, క్రీడలు, రహదారులు, భవనాలు, అటవీ, పంచాయతీరాజ్ గా పనిచేశారు.


Also Read: రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అయ్యన్నపాత్రుడు ఎనలేని కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయకుడు అన్నారు. 40 ఏళ్లుగా పసుపు జెండాను అయ్యన్న మోస్తున్నారని చెప్పారు. అత్యంత సీనయర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరని చంద్రబాబు అన్నారు. అందరి ఆమోదంలో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్ పిలుపునిచ్చారని, ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు అన్నారు.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×