BigTV English

TDP Vs YARCP Cadre Fighting at Gurajala: పోలింగ్ కేంద్రాల ఉద్రిక్తత.. కార్యకర్తల ఫైటింగ్.. లాఠీ‌ఛార్జ్.. ఈవీఎంలు ధ్వంసం!

TDP Vs YARCP Cadre Fighting at Gurajala: పోలింగ్ కేంద్రాల ఉద్రిక్తత.. కార్యకర్తల ఫైటింగ్.. లాఠీ‌ఛార్జ్.. ఈవీఎంలు ధ్వంసం!

TDP and YSRCP Cadre Fighting at Gurajala: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ పల్నాడు, రాయలసీమలోని పలు జిల్లాలు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. పోలింగ్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.


పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు టీడీపీ- వైసీపీ కార్యకర్తలు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమ లాఠీలకు పని చెప్పారు. అయితే సరే ఇరువర్గాల మధ్య కార్యకర్తలు శాంతించలేదు. పాత పగలు నేపథ్యంలోనే దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.

కడప జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను చితకబాదారు. పోలింగ్ స్టేషన్‌లో ఉన్న టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసి బయటకు లాగేశారు. అటు అనంతపురం జిల్లా కల్యాణ‌దుర్గంలో ఓ పోలింగ్ కేంద్రానికి గుంపుగా వచ్చారు వైసీపీ నాయకులు. అంతేకాదు వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఇదిలావుండగా చిత్తూరు జిల్లా పీలేరులో తమ ఏజెంట్లను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.


Also Read:  ఏపీ ఓటర్లకు మోదీ, అమిత్ షా పిలుపు, ఆసక్తికర ట్వీట్ చేసిన..

మరోవైపు అన్నమయ్య జిల్లాలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎంలను ధ్వసం చేశారు వైసీపీకి చెందిన కార్యకర్తలు. దలైపల్లిలోని ఓ పోలింగ్ బూత్‌లోకి ఎంట్రీ కొందరు కార్యకర్తలు, టీడీపీ-జనసేనకు అధికంగా ఓట్లు అధికంగా నమోదుకావడంతో ఈవీఎంలపై తమ ప్రతాపం చూపించారు.

Tags

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×