BigTV English

A.P. door to door ration: జగన్ రేషన్..బాబు పరేషాన్

A.P. door to door ration: జగన్ రేషన్..బాబు పరేషాన్

Chandrababu government take decision to ban door to door ration: వైఎస్ జగన్ పాలనలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పథకం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అప్పట్లో రేషన్ డీలర్లు, పబ్లిక్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ పథకం కోసం జగన్ ఏకంగా తొమ్మిది వేలకు పైగా వాహనాలు కొనుగోలు చేశారు. వీటిల్లో వార్డులకు సంబంధించిన రేషన్ సరుకులు అన్నీ తీసుకెళ్లి వీధి చివరన ఆపేవారు. వార్డు ప్రజలంతా ఆ వాహనాల వద్దకు వచ్చి థంబ్ ముద్ర వేసి తమ రేషన్ సరుకులు తీసుకెళ్లేవారు. అప్పట్లో చాలా మంది ఇంతోటి దానికి ఇంటింటికీ రేషన్ అని పేరు ఎందుకు వాహనాల దాకా వచ్చిన వాళ్లం రేషన్ షాపుల వద్దకు రాలేమా అని జగన్ సర్కార్ పై దుమ్మెత్తిపోశారు. పైగా ఈ వాహనాల కొనుగోలు పేరిట జగన్ సర్కార్ కోట్లు ఖర్చుచేశారని..పైగా ఇంటింటికీ రేషన్ పథకం ద్వారా ప్రభుత్వానికి అదనంగా 1800 కోట్లు ఖర్చు అవుతూందని నివేదిక ఇచ్చారు బాబుకు.


వాహనాల దుర్వినియోగం

జగన్ కొనుగోలు చేసిన వాహనాలు అక్రమంగా రేషన్ తరలింపునకు ఉపయోగపడ్డాయని జనం బాహాటంగానే విమర్శించారు. వాహనాలలో కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటాడు. వార్డుకు సంబంధించిన రేషన్ డీలర్ ఈ డ్రైవర్ సహాయంతో రేషన్ సరుకులు అందించేవారు. ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే సిబ్బంది వైసీపీ కార్యకర్తలే అని..కేవలం తమ పార్టీవారికి లబ్ది చేకూరాలనే ఈ పథకాన్ని జగన్ అమలు చేస్తున్నారని అప్పట్లో టీడీపీ శ్రేణులు కూడా విమర్శించాయి. అయితే ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా గిరిజనులు ఉండే ప్రాంతాలకు, రాకపోకలు సవ్యంగా లేని ప్రదేశాలకు ఈ తరహా రేషన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని చంద్ర బాబు ప్రభుత్వం భావిస్తోంది.


పాత పద్ధతి కంటిన్యూ

ఇకపై రేషన్ వస్తువులు తీసుకోవాలని భావించే వారు తప్పనిసరిగా పాత పద్ధతిలోన రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకోవాలనే ఆదేశాలు త్వరలోనే చేయబోతున్నట్లు సమాచారం. కేవలం రేషన్ షాపుల దందాను నియంత్రించడాని..అనవసర ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవడం ఉత్తమం అని పార్టీ శ్రేణులు కొందరు సూచిస్తున్నారు. ప్రజలకు ఏది ఆమోద యోగ్యమూ దానినే అనుసరించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రజాభిప్రాయం తీసుకుని ముందుకు వెళతారా లేక కీలక నిర్ణయం తీసుకుని ప్రభుత్వ అనవసర ఖర్చులు తగ్గించుకుంటారా అని అంతా ఎదురుచూస్తున్నారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×