BigTV English

AP Cabinet Meeting Highlights : కేబినెట్ నిర్ణయాలివే.. మూడు బిల్లుల్ని ఆమోదించిన ఏపీ అసెంబ్లీ..

AP Cabinet Meeting Highlights : కేబినెట్ నిర్ణయాలివే.. మూడు బిల్లుల్ని ఆమోదించిన ఏపీ అసెంబ్లీ..

AP Cabinet Meeting Highlights(AP news live): ఏపీ సెక్రటేరియట్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో.. మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు పలు ఇతర నిర్ణయాలను కూడా తీసుకుంది.


నంద్యాల జిల్లా డోన్ లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే డోన్ లో.. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కళాశాల పనిచేయనుంది.

Read More :AP Budget 2024: ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ.2 లక్షల 86 వేల కోట్లు.. ద్రవ్యలోటు రూ.55 వేల కోట్లు..


ఇక.. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిస్ మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరిలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూ.గో. జిల్లా రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అనంతరం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ మూడు బిల్లులను ఆమోదించింది. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ బిల్లు-2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు-2024 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. వాటిని స్పీకర్ ఆమోదించారు.

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×