BigTV English

AP Cabinet Meeting : కూటమి ప్రత్యేకత చాటేలా బడ్జెట్ రూపకల్పన.. కలిసిరానున్న అంశాలేంటి..

AP Cabinet Meeting : కూటమి ప్రత్యేకత చాటేలా బడ్జెట్ రూపకల్పన.. కలిసిరానున్న అంశాలేంటి..

AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 6 రాష్ట్ర క్యాబినేట్ భేటి నిర్వహించనుండగా.. అప్పడే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేయనున్నారు. దీంతో.. కూటమి ప్రభుత్వం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఏఏ రంగాలకు బడ్జెట్ లో స్థానం కల్పించాలి, వారి ప్రాధాన్యతలు ఏంటి అనే విషయాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను తీర్చే అంశాలతో పాటు కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయంలో ఎంత మేర బడ్జెట్ కు ఉపయోగపడుతుందనే లెక్కలు తీసే పనిలో పడింది.


జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక నియమాలను, నిబంధనల్ని భారీగా ధిక్కరించారని, ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కాగ్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే అనుభవజ్ఞుడైన చంద్రబాబు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే జనసేనా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా.. కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని రాబట్టేందుకు బీజేపీ.. ఈ బడ్జెట్ ను తమదైన మార్కు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక శాఖ అధికారుల పాత్రను నామమాత్రం చేశారనే విమర్శలున్నాయి. అధికారుల్ని పక్కన పెట్టి.. ప్రైవేట్ కన్సల్టెన్సీల సాయంతోనే పద్దును రూపొందించారని, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఎప్పుడో చివర్లో గణాంకాలకు తుదిరూపు ఇచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. పూర్తిగా రాష్ట్ర పరిస్థితిని అద్దం పట్టేలా, ఆర్థిక శాఖలో క్రమశిక్షణ తీసుకువచ్చేలా తాజా బడ్జెట్ రూపకల్పన చేయనున్నారు.

అధికారం చేపట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించి.. ఖర్చులు నెట్టుకొస్తున్నారు. ఇప్పుు… కొత్త బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇచ్చేలా తీవ్ర కసరత్తులు చేస్తోంది. వైసీపీ భారీ ఉచితాలతో ఓటర్లను ఆకట్టుకుంటోందని కూటమి పార్టీలు సైతం దాదాపు అదే స్థాయిలో హామీల వర్షం కురిపించాయి. దాంతో.. వస్తున్న ఆదాయానికి, చేస్తున్న ఖర్చులకు పొంతన లేకుండా పోయింది. ఇప్పుడు.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అప్పటి వడ్డీలు, ఇప్పుడు పథకాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడి నుంచి డబ్బులు సమకూర్చాలన్నది పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది.


కలిసిరానున్న కేంద్రం సాయం
మొదట్లో బీజేపీ కి దూరంగా ఉన్న చంద్రబాబు… పవన్ కళ్యాణ్ ప్రయత్నాలతో కలిసి మూడు పార్టీలు కలిసి నడిచే పరిస్థితి వచ్చింది. దాంతో కేంద్రంలోని బీజేపీ అండదండలు రాష్ట్ర ప్రభుత్వానికి లభించాయి. ఇప్పుడు చాలా అంశాల్లో ఇదే కలిసి రానుంది. రాష్ట్ర ప్రజల వరప్రదాయిగా భావిస్తున్న పొలవరం పూర్తికి కేంద్రం ఆదుకుంటుందని హామి ఇచ్చింది. పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్, టెక్నికల్ సాయం చేసేందుకు అంగీకారం తెలిపింది. దాంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద పని తప్పినట్లైంది. హాయిగా.. నిధులు, టెక్నాలజీ వంటి అంశాలతో పని లేకుండా.. కేవలం పర్యవేక్షించుకుంటూ ఉంటే సరిపోతుంది.

అలాగే.. కూటమి ప్రభుత్వానికి కీలకమైన అమరావతి నిర్మాణానికి సైతం కేంద్రం అండదండలు ఉండడంతో ఏపీ సర్కార్ కు చాలా పెద్ద రిలీఫ్ దక్కినట్లైంది. మొదటి విడత పరిపాలనలో రాజధాని నిర్మాణం పూర్తి కాకపోవడం ఇబ్బందికరంగా మారింది. సెక్రటెరియన్ నిర్మాణం చేపట్టినా, అతి తాత్కాలికమే కావడం, అమరావతి భూములను సేకరించే పనిలోనే అధికార సమయం అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు రాజధాని పనుల్ని పూర్తి చేయాలని భావిస్తోంది. లేదంటే.. ఈసారి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే.. కేంద్రం నుంచి రూ.15 వేల కోట్లు సాధించిన నేపథ్యంలో ఇక రాజధాని విషయంలో మిగతా అంశాలైన.. పరిశ్రమల్ని ఆకర్షించడం, ఉద్యోగ కల్పన, సంస్థలకు భూముల కేటాయింపులతో పాటు నిరంతరం అభివృద్ధి పనుల్ని పర్యవేక్షించే పనిలో అధికారుల్ని పరుగులు పెట్టించాల్సి ఉంది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×