E-Paper
Advertisement

AP Muncipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

AP Muncipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Advertisement

AP Muncipal Elections : ఆంధ్రప్రదేశ్ లో పలు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు శంఖారావం మోగింది. ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలైంది. పలు మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపికకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ కు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఈ నెల 30లోగా సమావేశం ఏర్పాటు చేయాలని.. ఫిబ్రవరి 3న ఎన్నిక జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో TPTY, NLR, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. నందిగామ, హిందూపురం, పాలకొండలో ఛైర్పర్సన్స్ కు ఎన్నికలు జరగనుండగా.. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్లలో వైస్ ఛైర్పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగి పూర్తవ్వకముందే రాష్ట్రంలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులు భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 3న జరగబోతున్న ఎన్నికలకు ఆయా ప్రాంతాల కలెక్టర్లు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో రెగ్యులర్ మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ఇంకా గడువు మిగిలే ఉండటంతో… అప్పటి వరకూ ఈ ఎన్నికల్లో ఎన్నికైన వాళ్లు ఆయా పదవుల్లో కొనసాగుతారు.

Advertisement

ALSO READ : అప్పు అడిగితే.. పారిపోతున్నారు.. సీఎం చంద్రబాబు

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×