BigTV English

AP CID: బిగ్ బ్రేకింగ్.. సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ.. రఘురామ ఫుల్ ఖుషీ?

AP CID: బిగ్ బ్రేకింగ్.. సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ.. రఘురామ ఫుల్ ఖుషీ?

AP CID: బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. ఆయన వెంటనే రిలీవ్ కావాలని.. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సునీల్ కుమార్ బదిలీకి కారణాలు ఇంకా తెలియరాలేదు.


ఏపీ సీఐడీ చీఫ్ గా సంజయ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఫైర్ సర్విసెస్ డీజీగా ఉన్నారు సంజయ్.

ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ పై ఇన్నాళ్లూ అనేక రాజకీయ విమర్శలు వచ్చాయి. వైసీపీ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ అమలు చేశారనే విమర్శలు బలంగా వినిపించాయి. జగన్ తొత్తుగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పని చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు గుప్పించేవి.


ఇక, వైసీపీ ఎంపీ రఘురామ ఎపిసోడ్ లో సునీల్ కుమార్ పేరు మారుమోగిపోయింది. ఎంపీ రఘురామను హైదరాబాద్లో అరెస్ట్ చేసి.. బలవంతంగా ఏపీకి తరలించి.. పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీతో తనను టార్చర్ చేశారంటూ రఘురామ ఆరోపించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వీడియో కాల్ లో చూస్తూ.. తనను తీవ్రంగా కొట్టించారని చెప్పడం సంచలనంగా మారింది. జగన్ కళ్లలో ఆనందం కోసమే సునీల్ తనను టార్చర్ చేశారని మండిపడ్డారు. పాదాలకు అయిన గాయాలను కోర్టులో ప్రదర్శించారు రఘురామ. ఆ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం.. ఆ సమయంలో కొన్ని వారాల పాటు రఘురామ, సునీల్ వ్యవహారం హాట్ టాపిక్ గా నడిచింది.

మరోవైపు, సునీల్ చేసిన కొన్ని మతపరమైన వ్యాఖ్యలపైనా రఘురామ సుప్రీంకోర్టులో కేసు వేయడం.. ఆ వీడియోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సునీల్ డిలీట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు సునీల్ ను ఏపీ సీఐడీ చీఫ్ పదవి నుంచి తొలగించడంతో.. ఈ న్యూస్ అందరికంటే ఎంపీ రఘురామకృష్ణరాజుకే ఎక్కువ సంతోషం ఇచ్చి ఉంటుంది. సునిల్ ను బదిలీ చేయడంతో ప్రతిపక్షాలూ పండగ చేసుకుంటున్నాయి.

సునీల్ కుమార్ పై కోర్టులో ఫ్యామిలీ కేసు కూడా నడుస్తోంది. భార్యతో విడాకుల కేసు, ఆమె పుట్టింటి వారిని వేధించారనే ఆరోపణలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.

Tags

Related News

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Big Stories

×