E-Paper
Advertisement

Himachal Pradesh climate:- వాతావరణంలో మార్పులు.. హిమాచల్ ప్రదేశ్‌పై ఎఫెక్ట్..

Himachal Pradesh climate:- వాతావరణంలో మార్పులు.. హిమాచల్ ప్రదేశ్‌పై ఎఫెక్ట్..
Advertisement

Himachal Pradesh climate:- వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు గమనిస్తూనే ఉన్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే ప్రమాదాలను వారు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి ఇప్పటికే పలు ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో అలాంటి ఒక ఉదాహరణే చోటుచేసుకుంది.

హిమాచల్ ప్రదేశ్‌ అంటేనే మంచు ప్రాంతం. అక్కడ ఏడాదిలో ఎక్కువశాతం మంచు పడుతూనే ఉంటుంది. అయితే సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ హిమాచల్ ప్రదేశ్‌లో మంచు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు గమనించారు. 2019-20తో పోలిస్తే 2020-21 చలికాలంలో మంచు 18.5 శాతం తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది.

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు పెద్ద నదులు ఉన్నాయి. అదే రవి, సట్లెజ్, చెనాబ్, బేస్. ఈ నాలుగు ప్రాంతాల్లో మంచు శాతం బాగా తగ్గిపోయినట్టుగా పరిశోధకులు గమనించారు. ముఖ్యంగా రవి, సుట్లెజ్ నదీ తీరాల్లో 23 శాతం మంచు తగ్గిపోయినట్టుగా తెలిపారు. ఇది వాతావరణ మార్పుకు సంకేతమని వారు అన్నారు. బేస్ నదీ తీరంలో మంచు శాతం 9 వరకు తగ్గిందని, చెనాబ్ వద్ద 9 శాతం తగ్గిందని పరిశోధకులు తెలిపారు.

మంచు తగ్గిపోవడం వల్ల దాని వల్ల ఏర్పడే మంచు గడ్డలు కూడా కరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో చిన్న, చిన్న నదులు లాంటివి ఏర్పడ్డాయని పరిశోధనల్లో తేలింది. చుట్టు పక్కల ఉండే చెత్త ఆ నదులలో వచ్చి చేరడం వల్ల కాలుష్య శాతం మరింత పెరిగిపోయి హిమాచల్ ప్రదేశ్ వాతావరణానికే ముప్పుగా మారనుందని వారు హెచ్చరించారు.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×