BigTV English

CM Chandrababu: భార్య, బామ్మర్థి మధ్య నలిగిపోతున్న.. బాలయ్యపై చంద్రబాబు పంచులు

CM Chandrababu: భార్య, బామ్మర్థి మధ్య నలిగిపోతున్న.. బాలయ్యపై చంద్రబాబు పంచులు

CM Chandrababu: సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషన్ అవార్డు వచ్చిన సందర్భంగా.. ఆయన సోదరి నారా భువనేశ్వరి ఘనంగా విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలకృష్ణ, భువ్ ఇద్దరి మధ్య నిల్చున్నాను. వీళ్లద్దరి మధ్య నిలబడటం ప్రమాదం. నిన్నటి వరకు అల్లరి బాలయ్య, ఇప్పుడు పద్మభూషన్ బాలయ్య అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకిత భావం లెక్కలేనన్ని జీవితాలను నిలబెట్టిందన్నారు. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజమైన ఐకానిక్‌‌కు దయగల నాయకుడికి తగిన గౌరవం అంటూ సీఎం చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు.


గత కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ, అజిత్, శోభనలకు ఈ అవార్డులు రావడంతో.. దక్షిణాది సినీలోకం సంబరాల్లో మునిగితేలుతోంది. అటు ఉత్తరాదిలోనూ శేఖర్ కపూర్ తదితరులకు ఈ పురస్కారాలు దక్కడంతో.. చిత్రసీమ యావత్తూ.. ఫుల్ జోష్ దిల్ ఖుష్ వాతావరణం సంతరించుకుంది.

ఇటీవల యాభై ఏళ్ల సినీ వసంతోత్సవాలను జరుపుకున్న బాలకృష్ణ.. అభిమానులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై నాట్ ఓన్లీ జై బాలయ్యా.. బట్ ఆల్సో పద్మ భూషణ్ జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఏంటీ వరుస వెంబడి గుడ్ న్యూస్‌లు.. రీసెంట్‌గా డాకూ మహరాజ్‌తో 4సారి కూడా 100 కోట్ల క్లబ్ మెంబర్ అయిన బాలయ్య అభిమానులకు బోనస్‌గా కేంద్ర ప్రభుత్వం.. మరో బంపరాఫర్ ప్రకటించింది.


బాలకృష్ణ నట ప్రస్తానం.. సుదీర్ఘమైనది. తాతమ్మ కల సినిమాలో తండ్రి ఎన్టీఆర్‌తో కలసి నటించిన బాలకృష్ణ.. అంచెలంచెలుగా ఎదిగి సోలో హీరో అయ్యారు. తొలినాడు ఫ్యామిలీ హీరోగా బాక్సాఫీస్ బోనాంజాగా.. మారి ఆపై ఫ్యాక్షన్ అధ్యాయాన్ని తెలుగు తెరపై లిఖించి నటసింహగా విజృంభించారు. అటు నుంచి వరుస హిట్లు నమోదు చేస్తూ నేడు గ్లోబల్ లయన్ అంటూ అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకుంటున్నారు.

Also Read: ట్రాక్టర్ తో గేట్లు బద్దలుగొట్టి.. ముద్రగడ ఇంటిపై దాడి.. కిర్లంపూడిలో టెన్షన్‌

ఇన్నాళ్లు అభిమానుల నుంచి వరుస బిరుదులందుకుంటూ వస్తున్న బాలకృష్ణకు.. కేంద్రం కూడా ఒక అవార్డునివ్వాలని నిశ్చియించింది. బాలయ్య సినీ ఇమేజీ, ఆయన హిందూపూర్ హాట్రిక్ ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి సంతకాలు చేస్తూ.. తాను ఎమ్మెల్యే కాక మునుపే బసవతారకం ట్రస్ట్ ద్వారా ఎందరో క్యాన్సర్ రోగుల పాలిట ఆరోగ్య అభయాన్నందిస్తున్న బాలకృష్ణకు ఈ అవార్డు రావడంతో.. పలువురు సినీ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

మూవీస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన బాలకృష్ణ.. బసవాతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు సహాయం అందిస్తున్నారు. ఇక హిందూపురం ఎమ్మెల్యేగా, ఆ ప్రాంత ప్రజల అభివృద్దికి దోహదపడుతున్నారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఓ వైపు ఎమ్మెల్యేగా రాజకీయాలు తన మార్క్‌ను చూపిస్తూ.. మరోవైరు సినిమాలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు బాలయ్య. ఈ నేపథ్యంలోనే కళారంగంలో బాలయ్య సేవలకు కేంద్రం పద్మభూషన్ ప్రకటించింది.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×