Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా పేరు.. కాపులపై తనకే పేటెంట్ ఉన్నట్లు మాట్లాడుతుండటం ఆయన స్టైల్ .. దశాబ్దకాలం ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన .. వైసీపీ లీడర్ అవతారమెత్తారు. వైసీపీకి కాపు సామాజికవర్గం మద్దతు కూడగట్టడానికి నానా పాట్లు పడ్డారు. ఆ క్రమంలో ఆయన చంద్రబాబు సహా పవన్‌కళ్యాణ్, చిరంజీవిలపై సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. పిఠాపురంలో పవన్‌ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని శపధం చేసి.. పద్మానాభరెడ్డిగా మారిపోయారు.
ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా తెగ హడావుడి చేశారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్.. గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గానికి పెద్దన్నగా వ్యవహరించడానికి నానా పాట్టు పడ్డారు. అలాంటి ముద్రగడ పద్మనాభం మాటంటే మాటే అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తాను పేరు మార్చుకుంటాను అని సవాల్ చేసి దానికి కట్టుబడి పద్మనాభరెడ్డి అని మార్చుకున్నారు.
కాగా.. తాజాగా ముద్రగడ ఇంటిపై దాడి జరగటం హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై తెల్లవారుజామున దాడి జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో కిర్లంపూడిలోని ఆయన ఇంటి గేటు విరగ్గొట్టుకుని లోపలికి ప్రవేశించినట్టు చెప్తున్నారు. ముద్రగడ కారును ట్రాక్టర్‌తో ఢీ కొట్టాడు.
పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ ఇంట్లోంచి బయటకొచ్చారు. ట్రాక్టర్‌తో వచ్చిన అతన్ని పట్టుకోగా.. అతను జై జనసేన అంటూ నినాదాలు చేసినట్టు చెప్తున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. ఇంతలో ముద్రగడ అభిమానులు, వైసీపీ నేతలు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైతం అప్రమత్తమై.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దాడి చేయడం వెనకాల ఎవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దాడికి పాల్పడిన వ్యక్తికి శిక్షపడేలా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: బొత్స స్టైలే వేరయా.. అధికారమైనా, ప్రతిపక్షమైనా అంతా నాదే..
ఇదిలా ఉంటే.. వైసీపీ నాయకుడిగా ఉన్న ముద్రగడ మళ్లీ ప్రత్తిపాడు వైపు చూస్తున్నారన్న ఇటీవల టాక్ వినిపించింది. మరి ప్రత్తిపాడులో పోటీ చేయను అని చెప్పి.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉన్న ముద్రగడ మళ్లీ ప్రత్తిపాడు వైపు చూస్తున్నారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తన కోసం కాదని తన కుమారుడు గిరి రాజకీయ భవిష్యత్తు కోసం అని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారని ప్రచారం సాగుతోంది.