E-Paper
Advertisement

CBN Serious on jagan Over Security: పరదాలు కట్టుకుని తిరిగే సీఎంకు 986 మందితో భద్రతనా..?: చంద్రబాబు

CBN Serious on jagan Over Security: పరదాలు కట్టుకుని తిరిగే సీఎంకు 986 మందితో భద్రతనా..?: చంద్రబాబు
Advertisement

Chandrababu Serious on Jagan(Andhra politics news): ఏపీలో రాజకీయ నేరస్థులకు ఎక్కువగా భద్రత ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక ముఖ్యమంత్రికి 986 మందితో భద్రతనా? అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విలేకర్లు.. మాజీ సీఎం జగన్ భద్రతకు సంబంధించిన అంశంపై చంద్రబాబును ప్రశ్నలు అడిగారు. వెంటనే ఆయన స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడారు.

‘ఒక సీఎం భద్రతకు 986 మంది సిబ్బంది కావాలా..? అదీ పరదాలు కట్టుకుని తిరగడానికి..! ఇప్పుడు మేం వెళ్లినా కూడా పరదాలు కట్టేస్తున్నారు. ఏంటయ్యా ఇది అని అధికారులను అడిగితే అలవాటైపోయింది సర్ అని అంటున్నారు. పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయడమేంటి..? అవసరమైన మేరకే ట్రాఫిక్ ను ఆపాలని నేను చెబుతున్నాను. నాకు రెండు నిమిషాలు లేటైనా ఫర్వాలేదు.. నేను నిలబడుతా. వాళ్లంతా వెళ్లాకే వెళ్దామని చెబుతున్నాను. ఎక్కడా కూడా ఎక్కువ టైం ఆఫ్ చేయొద్దని మంత్రులకు, కేబినెట్ సమావేశంలోనూ చెప్పాను. ఎలాంటి ఆర్భాటాలూ వద్దని చెప్పాను. మనమేం రాజులం కాదు.. డిక్టేటర్లం కాదు.. ఇష్టానుసారం చేయడానికి. ప్రజాసేవకులుగా ప్రవర్తించాలంటూ వారికి సూచిస్తున్నా’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

ఇటు పోలవరం విషయంలో కూడా జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు నిర్లక్ష్యం వల్ల పోలవరం నిర్మాణం ఆగిపోయిందన్నారు. కాంట్రాక్టర్లను మార్చి.. నిధులను విడుదల చేయకుండా.. సరైనా అధికారులను బదిలీ చేసి.. చివరకు పోలవరంను పూర్తి చేయలేదన్నారు. కేంద్రసహాయంతో పోలవరాన్ని పూర్తి చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణ విషయంలో కూడా కేంద్ర సహాయాన్ని కోరుతామన్నారు.

Also Read: పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Advertisement

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేసింది. ప్రస్తుతం ఏపీఎస్ పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్ ను ఏసీబీ డీజీగా నియమించింది. విశాఖపట్నం సీపీగా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ ను సీఐడీ అదనపు డీజీగా బదిలీ చేసింది. అదేవిధంగా శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×