CM Chandrababu: మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ చేశారు. కాసేపట్లో మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి నుంచి అందే సహాయ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరించనున్నారు. కాగా ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తైంది. అందులో 4లక్షల మెట్రిక్ టన్నుల్ని కొనుగోలు చేశారు. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
మరోవైపు ఇప్పటికే కేంద్ర వ్యవసాయ మంత్రి, కార్యదర్శులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. చర్చల తర్వాత మార్కెట్ ధర-సాగు ఖర్చుకు మధ్య తేడాను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ స్కీంలో సేకరించే సరుకు గరిష్ఠ పరిమితిని.. 25శాతం నుంచి 75 శాతం పెంచేందుకు ఒకే చెప్పింది. మిర్చిసాగు వ్యయాన్ని ఐకార్ నిర్ణయించిన 10వేల ధర స్థానంలో.. ఏపీ సర్కార్ ఖరారు చేసిన 11వేల 600ని పరిగణనలోకి తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడంపై కేంద్రం ఫోకస్ చేసింది.
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు చేసిన కీలక ప్రతిపాదనలకు స్పందించింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ మంత్రి చౌహాన్.. మిర్చి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి.. పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో మిర్చి ధరలు, మిర్చి రైతుల సమస్యపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్ కి విన్నవించారు. మిర్చి ధర పెంపుతో పాటు ఎగుమతుల విషయంలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. దీంతో శుక్రవారం నాడు శివరాజ్ సింగ్ మిర్చిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మార్కెట్ ఇంటర్వర్షన్ స్కీమ్ కింద మిర్చి రైతులను ఆదుకునే విషయంపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.. కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్. దీంతో పాటు.. కనీస మద్ధతు ధరపై కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఏపీలో మిర్చి ధరల పతనంపై మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. తమ హయాంలో ఉన్న ధరలు.. ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలకు తేడా వివరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మిర్చి రైతులకు తగిన న్యాయం చేయడాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు మిర్చియార్డులో జగన్ రైతులను పరమార్శించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఇటు సీఎం చంద్రబాబుకే కాదు అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి లేఖ రాశారు.
మిర్చి ధరల విషయమై.. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కి విన్నవించడంతో.. చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ దిశగా తక్షణ చర్యలు, పరిష్కార మార్గాలు కనుగొనాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షలో ఏపీ నుంచి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. మిర్చికి 11 వేల 600 రూపాయలకు పైగా ధర ఇవ్వాలని కోరినట్టు చెప్పారు రామ్మోహన్ నాయుడు.
Also Read: చంద్రబాబు సర్కార్ గురించి గూగుల్ ఇలా చూపిస్తోందా?
ధరల పెరుగుదల పైనే కాదు.. మిర్చి ఎగుమతులపైనా చర్చించామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు. ఎగుమతి దారులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి తమకు భరోసా ఇచ్చారని అన్నారు రామ్మోహన్.
ధరలు, ఎగుమతులే కాకుండా.. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి మరికొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. మార్కెట్ ఇంటర్వర్షన్ స్కీమ్ కింద.. కేంద్ర ప్రభుత్వం 25 శాతం పంట కొనుగోలు సీలింగ్ తొలిగించి. సాధ్యమైనంత ఎక్కువ పంట కొనుగోలు చేయాలని సూచించారు. అంతే కాదు ఐసీఏఆర్ నిర్ణయించిన మిర్చి ధరలు ఏపీ రైతుల సాగు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయించినట్టు కనిపిస్తోంది కాబట్టి.. వాటిని సరిదిద్దాలని సూచించారు. మిర్చి కొనుగోలు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు ఎలా పంచుకోవాలో తగిన ఆలోచన చేయాలని కూడా కోరారు. బాబు చేసిన ఈ ప్రతిపాదనలపై సమీక్ష చేసి.. రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.