BigTV English

Nindu Noorella Saavasam Serial Today February 22nd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన అమర్‌ – సంతోషంతో డాన్స్‌ చేసిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today February 22nd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన అమర్‌ – సంతోషంతో డాన్స్‌ చేసిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today Episode :  రూంలోకి వెళ్లిన అనామిక బట్టలు సర్దుతుంటే ఏదైనా సాయం కావాలా అనామిక గారు అంటూ రాథోడ్‌ వెళ్తాడు. ఏమీ వద్దని అనామిక చెప్తుంది. డోర్‌ దగ్గర నిలబడి దొంగచాటుగా చూస్తున్న మిస్సమ్మ కూడా మెల్లగా లోపలికి వెళ్లి అనామికను పలకరిస్తుంది. ఓ రాథోడ్‌ నువ్వు ఇక్కడే ఉన్నావా..? అంటూ పలకరిస్తుంది. రాథోడ్‌ వెటకారంగా చూస్తూ.. ఈ రూం ఆమెకు లక్కీ అంట చూడు.. అంటూ మెల్లగా మిస్సమ్మకు చెప్తాడు. దీంతో మిస్సమ్మ రాథోడ్‌ ను గుర్రుగా చూస్తూ.. అనామిక గారు మీకేం కావాలన్నా నన్ను అడగండి అని చెప్తుంది. దీంతో అనామిక ఓకే మిస్సమ్మ గారు అని చెప్తుంది. అయితే పిల్లల  టైం టేబుల్ సెట్‌ అయింది కదా అని అడుగుతుంది. అయిందని పిల్లలు చెప్పారని అనామిక చెప్పగానే.. అయితే మీరు అదే టైమింగ్‌ ఫాలో అయిపోండని మిస్సమ్మ చెప్పగానే.. సరే కానీ పొద్దున్నే ఆ టైంకి లేవడం మీకు ఓకేనా..? ఆ టైంకి లేస్తే పిల్లల డే మొత్తం కంగారుగా ఉంటుంది. కదా..? కొంచెం టైం మార్చోచ్చా..? అని మిస్సమ్మను పర్మిషన్‌ అడుగుతుంది అనామిక.


అయితే పిల్లలు ఐదున్నరకు లేవడం గురించి అడుగుతుందేమో.. అని మిస్సమ్మ మనసులో అనుకుని బాగా ఎర్లీగానే లేస్తున్నారు కదా..? కానీ ఇది ఆయన రూల్‌ అని చెప్తుంది. దీంతో ఏంటి ఏడున్నరకు ఎర్లీ మార్నింగా..? మరి ఐదున్నరను వీళ్ల భాషలో ఏమంటారో..? పిల్లల వన్‌ అవర్‌ స్టడీ చాలు అన్నారు కదా..? కొంచెం ఏమైనా పెంచుదామేమో అడుగుదాం  అని మనసులో అనుకుని..  పోనీ పిల్లలకు స్టడీ అవర్స్‌ ఏమైనా కొంచెం పెచుదామా..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ వద్దరని పిల్లలు చెప్పిన టైంను మీరు బ్లైండ్‌గా ఫాలో అయిపోండి. అంటుంది. అనామిక ఓకే అంటుంది. ఇంతలో అమర్‌ మిస్సమ్మను పిలుస్తాడు. ఆ పిలుపునకు అనామిక ఆశ్చర్యపోతుంది. అదేంటి సార్‌ కూడా మిమ్మల్ని మిస్సమ్మ అంటున్నారేంటి అని అడుగుతుంది. దీంతో రాథోడ్‌ కూడా ఆమెకు డౌటు వచ్చింది మిస్సమ్మ ఇక నువ్వు  జాగ్రత్తపడాలి అంటాడు. దీంతో మిస్సమ్మ కోపంగా రాథోడ్‌ను తీసుకుని ఆ రూంలోకి బయటకు వచ్చేస్తుంది. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచేలా చేస్తాను చూడు అంటూ వెళ్లిపోతుంది.

మిస్సమ్మ రూంలోకి రాగానే.. నా బుక్‌ ఎక్కడ పెట్టావు మిస్సమ్మ అని అడుగుతాడు అమర్‌. దీంతో సైలెంట్‌గా బుక్‌ తీసుకొచ్చి ఇస్తుంది మిస్సమ్మ. మిస్సమ్మ వాలకం చూసి ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు అమర్‌. దీంతో మిస్సమ్మ ఇరిటేటింగ్‌గా చెప్పాలి, అడగాలి, అరవాలి, సమాధానం కావాలి, మార్పు జరగాలి అంటూ అమర్‌ మీదకు వెళ్తుంది. దీంతో అమర్‌ మెల్లగా ముందు నువ్వు గాలి తీసుకుని మాట్లాడతావా అంటాడు. దీంతో మిస్సమ్మ కోపంగా మీరు అందరిలాగా నన్ను మిస్సమ్మ అని పిలవడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. దీంతో అమర్‌ నాక్కూడా నచ్చడం లేదు. అది నీ కసలు సూటు అవడం లేదు అంటాడు. దీంతో మరి నాకు సూట్యే పేరేంటో మీరే చెప్పండి అంటుంది. దీంతో చెప్పడం ఎందుకు అటు తిరుగు పిలుస్తాను అంటాడు అమర్‌. మిస్సమ్మ అటు తిరగ్గానే.. ఏయ్‌ లూజ్‌ అని పిలుస్తాడు. మిస్సమ్మ తిరిగి కోపంగా చూస్తుంటే.. మెంటల్‌ అయితే సరిగ్గా సరిపోతుంది అంటాడు. దీంతో మిస్సమ్మ కోపంగా వచ్చి దిండు తీసుకుని మిమ్మల్ని ఎలాగూ కొట్టలేను అని తనను తాను కొట్టుకుంటుంది. కాలు జారి కిందపడబోతూ అమర్‌ను పట్టుకుంటుంది. దీంతో అమర్‌, మిస్సమ్మ మీద పడతాడు. తర్వాత అమర్‌ నిన్ను పేరు పెట్టే పిలుస్తాను అంటాడు. దీంతో మిస్సమ్మ హ్యాపీగా డాన్స్‌ చేసుకుంటూ కిందకు వస్తుంది.


డాన్స్‌ చేస్తూ కిందకు వస్తున్న మిస్సమ్మను చూసిన రాథోడ్‌ వెటకారంగా నా పేరును తెలియపరుస్తానని చెప్పి వెళ్లి ఇప్పుడేంటి పిచ్చి దానిలా డాన్స్‌ చేసుకుంటూ వచ్చేస్తున్నావు అంటాడు. దీంతో మస్సమ్మ ఇప్పుడు చూడు అంటూ వన్‌, టూ అంటుంది. ఇంతలో రాథోడ్‌ ఆ త్రీ కూడా అనేశా ఇప్పుడేంటి అంటాడు. ఇంతలో పై నుంచి అమర్‌ మిస్సమ్మను భాగీ అని పిలుస్తాడు. వెంట వెంటనే భాగీ అని పిలవడంతో ఇంట్లో అందరూ విని షాక్‌ అవుతారు. మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. మిస్సమ్మ మాత్రం ఎగిరి గంతేస్తుంది. సంతోషంతో డాన్స్‌ చేస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×