BigTV English

YCP Party on TDP Govt: చంద్రబాబు సర్కార్ గురించి గూగుల్ ఇలా చూపిస్తోందా?

YCP Party on TDP Govt: చంద్రబాబు సర్కార్ గురించి గూగుల్ ఇలా చూపిస్తోందా?

YCP Party on TDP Govt: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన సైకో సోషల్ మూక.. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అదేపంథా కొనసాగిస్తోంది. జగన్ అండ చూసుకుని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనా పార్టీ నాయకులు, మహిళలపై, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం , ఇతర ముఖ్య నేతలపై ట్రోల్స్ చేయడం ఆగడం లేదు.


తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పాలన గురించి గూగుల్ ఏం చూపిస్తుందో చూడండని.. వైసీపీ అనుబంధ సోషల్ మీడియా ఖాతాలో ఆశ్చర్యకర పోస్ట్ చేశారు. ఇందులో గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి “1 lakh crore debt” అని టైప్ చేస్తే.. ఆంధ్రప్రదేశ్ రూ.1.12 లక్షల కోట్లను ఆరు నెలల్లో తీసుకుందని చెప్తోంది. కానీ వాస్తవానికి గూగుల్‌లో అలా చూపించకపోవడం గమనర్హం. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

కాగా ఇటీవల సోషల్ మీడియాలో పైశాచిక పోస్టులు పెడుతున్న సైకోలకు చుక్కలు చూపించడం మొదలు పెట్టింది. సోషల్ మీడియోలో చెలరేగిపోతున్న ముసుగు ముఖాలపై.. ఏపీ ప్రభుత్వం ఉక్కపాదం మోపేందుకు సిద్ధమైంది. రాజకీయ నాయకులను మానసికంగా కృంగదీసేందుకు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఖాతాలను మూసేసి మాయమైన వారి పాత పోస్టుల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. నిందుతులపై కఠినమైన కేసులు పెట్టడంతో పాటు వారి అసలు ముఖాలను బహిర్గతం చేయాలనే పనిలో పడింది చంద్రబాబు సర్కార్.


Also Read: సజ్జలకు పవన్ కళ్యాణ్ షాక్.. 150 ఎకరాల భూముల రీ-సర్వే

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పాల్పడుతున్న వారిని గుర్తించి అసలు పేర్లు, వివరాలు, వారిపై నమోదైన కేసుల జాబితాను బహిరంగంగా ఉంచాలని యోచిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహిళా మంత్రులు, పలువురు నాయకులపై అసభ్యంగా దూషిస్తున్న పలువురిని సైబర్ బృందాలు గుర్తించాయి. వారందరి అసలుపేర్లను పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు సన్నాహాలు చేస్తుంది. మరి చంద్రబాబు పాలన గురించి గూగుల్ ఏం చూపిస్తుందో చూడండని.. వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తారో లేదో చూడాల్సిందే..

ఇదిలా ఉంటే.. సజ్జల భార్గవ్‌, వైసీపీ నేతల పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో కొందరు హద్దులు దాటారని, అందులో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడింది ధర్మాసనం. అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు.. సోషల్ మీడియా సాధనంగా మారుతోందన్నారు. అనుచిత పోస్టుల కట్టడికి తీసుకున్న చర్యలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం… తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×