BigTV English

Prudhviraj : స్టేజ్ మారింది.. ఇక 30 ఇయర్స్ పృథ్వీని ఆపలేం..!

Prudhviraj : స్టేజ్ మారింది.. ఇక 30 ఇయర్స్ పృథ్వీని ఆపలేం..!

Prudhviraj..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటులు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ (Prudhviraj) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈయన ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు ఈ వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయినా సరే ఏమాత్రం తగ్గను అంటూ పోస్టులు పెట్టడం అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా విశ్వక్ సేన్ (Vishwaksen) హీరోగా.. రామ్ నారాయణ్ (Ram Narayan) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘లైలా’. మొదటిసారి మాస్ హీరో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటించి ఆకట్టుకున్నారు. అయితే సినిమా మాత్రం పూర్తి డిజాస్టర్ గా నిలిచింది. దీనికి కారణం కంటెంట్ లో పస లేకపోవడం ఒక ఎత్తైతే.. మరొకవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు మరో ఎత్తు.


పృథ్వీరాజ్ వ్యాఖ్యలు.. డిజాస్టర్ గా మారిన లైలా..

ముఖ్యంగా వైసీపీ పార్టీని దృష్టిలో పెట్టుకొని.. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్ల కారణంగా లైలా సినిమాను #బాయ్ కాట్ లైలా, #డిజాస్టర్ లైలా అంటూ తెగ ట్రెండింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇక దెబ్బకు దిగివచ్చిన పృథ్వీరాజ్ అందరికీ క్షమాపణలు తెలియజేశారు. కనీసం ఇకనైనా ఈ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ దెబ్బకు సినిమా విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచింది. అటు వైసీపీ అభిమానులే కాదు ఇటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ సినిమాని డిజాస్టర్ చేసేసారు. ఇకపోతే లైలా డిజాస్టర్ కి ప్రధాన కారణం పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. దీంతో పృథ్వీరాజ్ కనీసం ఇప్పటికైనా మారుతారు అని అందరూ అనుకోగా.. ఇప్పుడు మళ్ళీ ఆయన తాజాగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఇంకెవరు నన్ను ఆపేది అన్నట్టు ట్వీట్ చేశారు.


ఇకపై ట్విట్టరే నా ఆయుధం.. ఆపే దమ్ముందా..?

ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా.. “హాయ్ నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ను.. ఇక ఇప్పటినుంచి నా అధికారిక ఖాతా X ద్వారానే నా భావనలు తెలియజేస్తాను. నిజానికి నేను నా భావాలను స్టేజ్ పైన ప్రకటిస్తుంటే.. దానివల్ల కలిగే పరిణామాలకు ఫీలవుతున్నాను. కాబట్టి ఈరోజు నుండి ఈ X ను వేదికగా ఉపయోగించుకొని.. నా భావ ప్రకటన స్వేచ్ఛని తెలియపరుస్తాను. ధన్యవాదాలు” అంటూ ట్వీట్ వేశారు పృథ్వీరాజ్. అంతే కాదు తన చేతితో గోవింద నామాలను చూపిస్తూ కన్నింగ్ ఫోజులిచ్చారు పృథ్వీరాజ్. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు ఎన్ని చేసినా.. నన్ను ఆపేది ఎవరు? అన్నట్లుగా ఆయన ఫోజులు ఇవ్వడం గమనార్హం. “స్టేజ్ మారింది..ఇక పృథ్వీ ను ఆపడం ఎవరి తరం కాదు” అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే పృథ్వీ రాజ్ ఇప్పుడు ఎక్కువగా వైసీపీ పార్టీని టార్గెట్ గా చేస్తూ కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి గతంలో వైసిపి పార్టీలో కొనసాగిన ఈయన అక్కడ కొన్ని విభేదాలు రావడంతో పార్టీకి రాజీనామా చేసి, జనసేన పార్టీలో చేరిపోయారు . ఇక ఇప్పుడు ఎక్కడ వెళ్లినా సరే వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ.. చేస్తున్న కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

 

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×