BigTV English

CM Chandrababu: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన ఖరారు

CM Chandrababu: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన ఖరారు

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన ఖరారైంది. సీఎం గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి పర్యటన ప్రారంభం కానున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణాలు, శంకు స్ధాపన జరిగిన ప్రాంతాన్ని ఈ సందర్భంగా సీఎం సందర్శించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లు సీఎం పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలోని వివిధ నిర్మాణాల స్థితిగతులను  తెలుసుకోనున్నారు.


ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఉదయం 11 గంటలకు సీఎం పర్యటన ప్రారంభం అవుతుంది. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. ఐదేళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసి.. జగన్ భవనాలను పాడు బెట్టారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 నుంచి 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసిందని తెలిపారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది.

Also Read: మంగళగిరిలో ప్రజా దర్బార్.. ప్రజల నుంచి అనూహ్య స్పందన


మాజీ సీఎం జగన్ గతంలో తొలి కలెక్టర్ల సమావేశానికి ప్రజావేదికను వాడుకుని మరీ, మరుసటి రోజే కూల్చి వేసి ఇంతవరకు శిథిలాలను తొలగించని చోటు నుంచే సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు. విధ్వంసానికి ప్రతీకగా ఆ ప్రాంతం గురించి అందరికీ తెలియచేయాలనే ఉద్యేశంతో సీఎం దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Related News

Driver Subramaniam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు విచారణ, నిందితుడు అనంతబాబు భార్యకు నోటీసులు

Free Electricity In AP: తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. వారందరికీ ఉచిత విద్యుత్

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

Big Stories

×