BigTV English

NTR: ఎన్టీఆర్ చూపంతా వారిమీదనే.. పక్కా ప్లాన్ చేశాడుగా.. ?

NTR: ఎన్టీఆర్ చూపంతా వారిమీదనే.. పక్కా ప్లాన్ చేశాడుగా.. ?

NTR: ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా వైపు చూస్తున్న విషయం తెల్సిందే. మన గురించి తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మాట్లాడుకుంటే చాలదు. ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలి.. ఇదే విధంగా ప్రతి హీరో ఆలోచిస్తున్నాడు. అందుకు తగ్గట్టే అడుగులు కూడా వేస్తున్నారు. ఇలా ఆలోచించి వారిలో ఎన్టీఆర్ కూడా ఒకడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ ను అందుకున్నాడు. ఇక ఈ రేంజ్ ను కాపాడుకోవడానికి ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు.


ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న సినిమాలు కానీ, అందులో క్యాస్టింగ్ కూడా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో వార్ 2 తో ఎంటర్ అయ్యిన విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా కష్టపడుతున్నాడు. వార్ 2 లో ఇప్పటికే కియారా అద్వానీ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ కోసం వేట మొదలయ్యింది. మొదట దీపికాను అనుకున్నారట. కానీ, ఆమె ప్రెగ్నెంట్ కావడంతో వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని సమాచారం.

ఇక అక్కడ కూడా బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే ఉండాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. ఇప్పటికే దేవర లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సెట్ అయ్యింది. ఎన్టీఆర్ 31 లో కూడా బాలీవుడ్ హీరోయిన్ ను మాత్రమే తీసుకోవాలని కోరుతున్నాడట ఎన్టీఆర్. అందుకు కారణం కూడా లేకపోలేదు.


ఇక ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కాబట్టి.. బాలీవుడ్ హీరోయిన్స్ ఉంటే ఇంకాస్త హెల్ప్ అవుతుందనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ఎన్టీఆర్ చూపంతా వారిమీదనే ఉందని టాక్. ఎన్టీఆర్ 31 కోసం ప్రశాంత్ నీల్.. కియారా అద్వానీని సంప్రదించే పనిలో ఉన్నాడని సమాచారం. ఏదిఏమైనా ఎన్టీఆర్.. బాగా గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు. మారి ఇవన్నీ వర్క్ అవుట్ అవుతాయా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×