YS Sharmila: మోదీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. దేశ ప్రజలను ఇబ్బంది పెట్టేలా పాలన సాగిస్తుందన్నారు. ప్రజలు, దళితులు, రాజ్యాంగాన్ని అవమానం, నాశనం చేసేలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీకే సపోర్టు చేస్తుందన్నారు షర్మిల. బీజేపీ పార్టీ చంద్రబాబు-జగన్-పవన్ చేతుల్లో ఉందన్నారు. బీజేపీ ఇంత రాక్షస పాలన చేస్తున్నా ఈ మూడు పార్టీలు వారికే మద్దతు ఇవ్వడాన్ని మండిపడ్డారు. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ తప్పితే మిగతా పార్టీల నేతలంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. జై బాపూజీ, జై భీమ్.. జై సంవిధాన్ పేరిట కాంగ్రెస్ పార్టీ కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టిందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అందరి మద్దతు కూడగట్టి ప్రెసిడెంట్‌కు తీర్మానం పంపాలని నిర్ణయించిందన్నారు.
బీజేపీ కచ్చితంగా క్షమాపణలు చెప్పే విధంగా ఒక రిజెల్యూషన్ తీసుకురావాలని నిర్ణయించిందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. దళితులంటే బీజేపీకి చిన్నచూపుని, ఆ పార్టీకి అస్సలు పడదన్నారు. కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుటినుంచో డిమాండ్ చేస్తున్నా సైలెంట్‌గా ఉంటోందన్నారు. దీనివల్ల దేశంలో ఏ కమ్యూనిటీకి చెందినవారు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు.
ALSO READ: అభిషేక్ రెడ్డికి అంత్యక్రియలు, పులివెందులలో జగన్ దంపతులు, రచ్చకు నో ఫుల్‌స్టాప్
ప్రభుత్వ వ్యవస్థలను తమ చేతుల్లో పెట్టుకుని స్వార్థ రాజకీయాలకు మోదీ సర్కార్ ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. అదానీ లాంటి వారిని ఆ పార్టీ పెంచి పోషిస్తోందన్నారు. దేశాన్ని కాషాయి మయం చేయడానికి బీజేపీ ప్లాన్ చేస్తోందని, చరిత్రను మార్చే ప్రయత్నం చేసిందన్నారు.
జాతిపిత గాంధీని చంపిన వారికి గుళ్లు కడుతున్నారు దుయ్యబట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. చివరకు రాజ్యంగ నిర్మాత అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారని, ఆయన కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు.