Worst Movie : సాధారణంగా సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉంటే అది మూవీకే ప్లస్ పాయింట్ అవుతుంది. ముఖ్యంగా యూత్ ఇలాంటి రొమాంటిక్ సినిమాల కోసం ఆకలి మీద ఉంటారు. మంచి క్యాస్టింగ్ ఉండి, కథకు తగ్గట్టుగా అలాంటి సీన్స్ ఉంటే థియేటర్లలో వేడిని పెంచడం ఖాయం. కానీ ఇలాంటి 25 ముద్దు సీన్లు ఉన్న ఓ సినిమా ఎఫెక్ట్ కారణంగా హీరోయిన్ ఏకంగా సినిమా ఇండస్ట్రీని వదిలేసింది. ఆ సినిమా ఏంటి? హీరోయిన్ ఎందుకు ఇండస్ట్రీని వదిలి పెట్టాల్సి వచ్చింది? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీలోకి వెళ్తే…
30 ముద్దులతో వరస్ట్ ఇండియన్ మూవీ…
బాలీవుడ్లో సీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకున్న స్టార్ ఇమ్రాన్ ఖాన్. ఈ హీరో సినిమా అంటే అలాంటి సన్నివేశాలు కచ్చితంగా ఉంటాయి అన్న ముద్ర పడిపోయింది. 2000 కాలంలోనే ఇలాంటి సీన్స్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఆయన నటించిన ‘మర్డర్’ మూవీ ఏకంగా 30 కిస్ సీన్స్ తో రికార్డును క్రియేట్ చేసింది. అయితే మల్లికా శెరావత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఇండియన్ హిస్టరీ లోనే అత్యంత వరస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ ఇది కాదు.
మరో ఇండియన్ వరస్ట్ మూవీ…
సినిమా చరిత్రలోనే వరస్ట్ మూవీ గా పేరు తెచ్చుకున్న ‘మర్డర్’ తర్వాత, ‘3g’ (3G – A Killer Connection) అనే రొమాంటిక్ మూవీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 2013లో రిలీజ్ అయిన హర్రర్ థ్రిల్లర్ ‘3జి – ఎ కిల్లర్ కనెక్షన్’. ఇందులో సోనాల్ చౌహన్ (Sonal Chauhan) – నీల్ నితిన్ ముఖేష్ కీలకపాత్రలు పోషించారు. ఐఎమ్డిబి లో 3.6 రేటింగ్ తెచ్చుకున్న ఈ సినిమా 2013లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 13 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా కేవలం 7.45 కోట్లు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఈ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ వరస్ట్ మూవీ గా రెండో ప్లేస్ ని సొంతం చేసుకుంది.
ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ ?
ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన సోనాల్ చౌహన్ (Sonal Chauhan) తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈ బ్యూటీ బాలయ్యతో కలిసి ‘లెజెండ్’ వంటి సినిమాల్లో నటించింది. అయితే 3g మూవీ ఇచ్చిన రిజల్ట్ తో సోనాల్ చౌహాన్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కనీసం బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో ఆమె బాలీవుడ్ ని వదిలేసి ఇతర ఇండస్ట్రీలలో అవకాశాల కోసం వెతకడం మొదలు పెట్టింది. ఫలితంగా సోనాల హిందీ చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పింది అనే రూమర్లు వైరల్ అయ్యాయి. ‘3జీ’ మూవీ రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత గానీ సోనాల్ కి బాలీవుడ్ నుంచి పిలుపు రాలేదు మరి. ఇటు తెలుగులో కూడా ఆమెకు కలిసిరాలేదు పాపం.