YS Jagan: మాజీ సీఎం జగన్ బంధువు అభిషేక్ రెడ్డి అనారోగ్య కారణంగా మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శనివారం తెల్లవారుజామున పులివెందులకు ఆయన పార్థివదేహం చేరింది. అంత్యక్రియలు శనివారం (ఇవాళ) పులివెందులలో జరుగుతున్నాయి.
ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న జగన్ దంపతులు ఉదయం 10 గంటలకు పులివెందులకు వెళ్లారు. అనంతరం అభిషేక్ రెడ్డి పార్దివ దేహానికి నివాళులర్పించారు జగన్ కుటుంబ సభ్యులు. తిరిగి నాలుగు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు వెళ్ళనున్నారు.
తమ రాజకీయ ఎదుగుదలకు ఎంతో పాటు పడ్డారని, వైయస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ మదన్ మోహన్ రెడ్డి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు అభిషేక్ రెడ్డి పార్ధవ దేహానికి నివాళులర్పించారు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి.
నాలుగు రోజు కిందట అభిషేక్‌రెడ్డి చనిపోయారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆసుపత్రి వర్గాలు గానీ, ఇటు వైఎస్ ఫ్యామిలీ సభ్యులు నోరు విప్పలేదు. అందరూ సైలెంట్ అయ్యారు. దీనిపై మీడియాతోపాటు సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరిగాయి. చివకు శనివారం అంత్యక్రియలని వైసీపీ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెల్సిందే.
ALSO READ: శ్రీవారిని దర్శించిన రోజా ఏం చెప్పారంటే? తిరుమల భక్తుల రద్దీ లేటెస్ట్ అప్ డేట్ ఇదే..
ఇక అభిషేక్ విషయంలో జగన్ వ్యవహారశైలిపై చాలామంది సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. బంధువు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా, ఒక్కసారి హైదరాబాద్ వెళ్లి ఆయనను కలిసిన సందర్భం లేదన్నారు.
రాజకీయంగా అందర్ని ఉపయోగించుకుని ఆ తర్వాత బయటకు పంపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా వర్ణించారు. అభిషేక్ మాత్రమే కాదు విజయమ్మ, షర్మిలను సైతం అదే విధంగా చేశారని అంటున్నారు. జగన్‌పై ఇంతలా ఇంటా బయటా ప్రచారం వ్యతిరేకంగా జరుగుతున్నా మౌనంగానే ఉండిపోయారాయన.