BigTV English
Advertisement

YS Sharmila: అసలు రాజకీయం ఇప్పుడే స్టార్ట్ చేసిన షర్మిళ.. టార్గెట్ తగిలేనా.. మిస్ అయ్యేనా ?

YS Sharmila: అసలు రాజకీయం ఇప్పుడే స్టార్ట్ చేసిన షర్మిళ.. టార్గెట్ తగిలేనా.. మిస్ అయ్యేనా ?

YS Sharmila: వైయస్ షర్మిళ అంటే తెలియని వారుండరు. నేటి రాజకీయాల్లో ఈమె మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైయస్ షర్మిళ (YS Sharmila) .. తన రాజకీయ భవిష్యత్ కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారనే చెప్పవచ్చు. అయితే పొలిటికల్ ఫ్యామిలీ నుండి వచ్చినా షర్మిళ గురి.. ఏకంగా సీఎం సీటు అయినప్పటికీ ఆ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి ఇంకా సమయం ఉంది. అప్పటిలోగా తాను బలాన్ని పెంచుకోవాలని, ఏపీలో నెంబర్-2 పార్టీగా కాంగ్రెస్ ఉండాలన్న భావనతో షర్మిళ ముందడుగు వేస్తున్నా.. అది ఫలించేనా లేదా అన్నది ఎన్నికల సమయంలో పరిస్థితులను బట్టి చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టిన షర్మిళ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ కుమార్తెగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే. తన అన్న వైయస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన సమయంలో షర్మిళ (YS Sharmila) బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. జగన్ అరెస్ట్ సమయంలో.. నేనున్నా అంటూ రాష్ట్ర పాదయాత్ర నిర్వహించారు ఆమె. ఆ సమయంలో వైసీపీ నెంబర్-2 నేత షర్మిళ అనుకున్నారు అంతా. కానీ పార్టీ అధికారంలోకి రాగానే ఆమె సైడ్ అయ్యారు అలాగే సైలెంట్ అయ్యారు.

పొలిటికల్ గా రాణించాలని, ప్రజాసేవలో ఉండాలనే భావన ఉన్న షర్మిళ.. అనూహ్యంగా తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆమె కాంగ్రెస్ వైపుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే కాంగ్రెస్ వేసిన వ్యూహం ఫలించిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏపీలో అధికారంలో ఉన్న జగన్, ఎదురుతిరిగి పార్టీ ఏర్పాటు చేసుకోగా.. అన్నకు పోటీగా చెల్లెలిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్షురాలిగా ప్రకటించి.. ఆల్ పొలిటికల్ పార్టీస్ కి షాకిచ్చిందని చెప్పవచ్చు.


Also Read: PM Modi: లక్కీ డ్రాలో మిక్సీ గెలుచుకున్న ప్రధాని మోదీ.. ట్విస్ట్ ఏమిటంటే..

ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడంలో షర్మిళ (YS Sharmila) విజయవంతమయ్యారు. కడప ఎంపీగా బరిలో నిలిచిన షర్మిళ (YS Sharmila) .. దురదృష్టవశాత్తు ఓటమి చవిచూసినా.. గట్టిపోటీ ఇచ్చారని చెప్పవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్ సమయానికి తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని.. తన బలం నిరూపించుకొనేందుకు షర్మిళ ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారని పొలిటికల్ టాక్.

11 స్థానాలకు పరిమితమైన వైసీపీ.. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటి నుండే గ్రామాల బాట పట్టే అవకాశం ఉంది. దీనికి కారణం పార్టీ వలసల నివారణే అన్నది పొలిటికల్ విశ్లేషకుల అంచనా. వైసీపీ నుండి కాంగ్రెస్ లోకి వలసలు అంత ఈజీ కానప్పటికీ.. చాలా వరకు వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారని, కానీ ఎన్నికలకు రెండేళ్లు ముందు పార్టీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులే తెలుపుతున్నారు. అయితే ఇటీవల కూటమి, వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న షర్మిళ.. సైలెంట్ గా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ బలం పెంచుకొనే పనిలో ఉన్నారట. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల సమయానికి తాను అనుకున్న టార్గెట్ చేరుకోవాలని భావిస్తున్న షర్మిళ.. కోరిక నెరవేరుతుందా.. లేదా వేచి చూడాలి. అప్పటిలోగా రాజకీయ ముఖచిత్రంలో ఎన్ని మార్పులు జరుగుతాయో కదా.. వెయిట్ అండ్ సీ.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×