E-Paper
Advertisement

Kanguva : “కంగువ” ఆడియో లాంచ్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్

Kanguva  : “కంగువ” ఆడియో లాంచ్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్
Advertisement

Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సూర్య కెరీర్ లో 42వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. బాబి డియోల్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. ఇక మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూర్య అభిమానులు ఎగిరి గెంతేసే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ కి ఒక పాన్ ఇండియా స్టార్ గెస్ట్ గా రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం పదండి.

ఆడియో లాంచ్ కి గెస్ట్ గా ఇద్దరు స్టార్స్

Advertisement

నవంబర్ 14న ‘కంగువ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో జోరు పెంచబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘కంగువ’ మూవీ ఆడియో లాంచ్ ను తెలుగు, తమిళ భాషలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారని, ఇప్పటికే మేకర్స్ అతిథులను సైతం ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. రెండు భాషల్లోనూ ఒక్కో స్టార్ ను ఈవెంట్ కు గెస్ట్ గా ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమా ఆడియో లాంచ్ కు గెస్ట్ గా తలైవా రజినీకాంత్ ను ఆహ్వానించారని, తెలుగులో డార్లింగ్ ప్రభాస్ ని ఇన్వైట్ చేశారని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.

తలైవా అతిథిగా ఒప్పుకున్నాడా?

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం తమిళంలో అత్యంత గ్రాండ్ గా జరగనున్న ‘కంగువ’ ఈవెంట్ కు రజినీకాంత్ ను మేకర్స్ ఇన్వైట్ చేశారని అంటున్నారు. కానీ ఇటీవలే ఆయన అనారోగ్యం కారణంగా రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెలిసిందే. మరి నడుస్తున్న టాక్ ప్రకారం ఆయన గెస్ట్ గా హాజరవుతారా? అనేది తలైవాతో పాటు సూర్య అభిమానుల మదిలో ఉన్న ప్రశ్న.

ఎనిమిది భాషలో మూవీ రిలీజ్…

ఈ సినిమాను ఏకంగా ఎనిమిది భాషలో రిలీజ్ చేస్తుండడం అంచనాలను అమాంతం పెంచేసింది. తెలుగు, తమిళ, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ తో సహా మొత్తం ఎనిమిది భాషలో కంగువ’ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీని నైజాం ఏరియాలో బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు.  సింగపూర్ లో హోం స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో ఫార్స్, అమెరికాలో ప్రత్యాంగిరా, యూకె లో యశ్ రాజ్ ఫిలిమ్స్ రిలీజ్ చేస్తుండగా… సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×