BigTV English

EC Meeting with AP CS, DGP: ఢిల్లీలో ఈసీతో ముగిసిన ఏపీ సీఎస్‌, డీజీపీ సమావేశం..!

EC Meeting with AP CS, DGP: ఢిల్లీలో ఈసీతో ముగిసిన ఏపీ సీఎస్‌, డీజీపీ సమావేశం..!

Elections Commission Meeting with AP CS and DGP on Violence Incident: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఢిల్లీలో ఏపీ సీఎస్‌, డీజీపీ సమావేశం అయ్యారు. ఎన్నికల అనంతరం హింసాత్మక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో తమకు నేరుగా వివరణ ఇవ్వాలన్న ఈసీ ఆదేశాలతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా పలు అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.


ఈ నెల 13 ఎన్నికలు జరిగిన రోజు, ఆ తర్వాత రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై
ఈసీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. గురవారం మధ్యహ్నం ఈ అల్లర్లపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని  ఈసీ ఇద్దరిని ఆదేశించడంతో సీఎస్, డీజీపీ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. పల్నాడు, చంద్రగిరి సహా పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ వివరణ కోరింది. ఘర్షణలు ఎందుకు జరిగాయని, పోలీసులు, నిఘా సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.

హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నా పోలింగ్ రోజు అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించినట్లు సమాచారం. పోలింగ్ రోజున పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన విషయాన్ని ఎన్నికల పరిశీలకులు ఈసీకి నివేదిక ఇవ్వడంతో వాటి గురించి ఇరువురిని ప్రశ్నించింది. బందోబస్తు ఏర్పాటు విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.


Also Read: అఖిలప్రియ కామెంట్స్, అంత ఈజీ కాదంటూ..

పోలింగ్ రోజు, ఆ తర్వత జరిగిన సంఘటనలు, తీసుకున్న చర్యలపై ఈసీకి సీఎస్, డీజీపీ నివేదిక అందజేశారు. ఇదిలా ఉంటే పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా పలు అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తోంది.

Tags

Related News

Tirumala: తిరుమ‌ల‌లో మ‌రో ఘోర అప‌చారం.. అలిపిరి మెట్ల వ‌ద్దే నాన్ వెజ్

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు, జగన్‌కు సన్నిహితుడా?

Nepal Crisis: ఫలించిన లోకేష్ కృషి.. నేపాల్ నుంచి స్వదేశానికి ఆంధ్రా వాసులు

Nepal: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని.. సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం

TTD Pink Diamond: శ్రీవారి పింక్ డైమండ్.. ఆర్కియాలజికల్‌ విభాగం క్లారిటీ, వైసీపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటి?

YS Jagan: మావాళ్లు ఇంకా గేర్ మార్చలేదు.. బాధపడుతున్న జగన్

Big Stories

×