BigTV English

AP Deputy CM Pawan Kalyan Kondagatu Visit: కొండగట్టు ఆంజన్న సన్నిధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. భారీగా ఏర్పాట్లు

AP Deputy CM Pawan Kalyan Kondagatu Visit: కొండగట్టు ఆంజన్న సన్నిధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. భారీగా ఏర్పాట్లు

Pawan kalyan to visit Kondagattu(Andhra pradesh today news): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మాదాపూర్ నివాసం నుంచి ఉదయం 7 గంటలకు ఆయన రోడ్డు మార్గాన బయలుదేరారు. మెగా ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘వారాహి’ అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో భాగంగా కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు.


కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న తర్వాత ప్రత్యేక పూజలు చేయనున్నారు. అంజన్న సన్నిధిలో గంటన్నరపాటు ఉండనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన 4.30 నిమిసాలకు తిరిగి హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకుంటారు. కాగా, కొండగట్టు ఏర్పాట్లపై జనసేన పార్టీ నేతలు సమీక్షించారు. ఆలయ ఈఓను కలిసి  పలు అంశాలపై చర్చించారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటన కావడంతో జనసేన పార్టీ నాయకులు..తమ అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.

పవన్ కల్యాణ్ గతంలో వారాహికి తొలి పూజ కొండగట్టులో నిర్వహించారు. అంతే కాకుండా కూటమి పొత్తులను సైతం కొండగట్టులోనే ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు ఆయన కొండగట్టును సందర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రాత్రి పవన్ కల్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.


Also Read: పరదాలు కట్టుకుని తిరిగే సీఎంకు 986 మందితో భద్రతనా..?: చంద్రబాబు

కొండగట్టు అంజన్న ఆశీస్సులతో మంచి జరిగిందని పవన్ కల్యాణ్ రెండోసారి కొండగట్టు పర్యటకు రావడంతో జనసేన శ్రేణుల్లో జోష్ నెలకొంది. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పింది. హైటెన్షన్ వైర్లు పడడం.. తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కల్యాన్ ఇష్ట దైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టును దర్శించుకుంటున్నారు.

Tags

Related News

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Big Stories

×