BigTV English

Karumanchi Samyukta: మహిళా సర్పంచ్ సంయుక్తపై పవన్ ప్రశంసల వర్షం.. ఎందుకంటే..?

Karumanchi Samyukta: మహిళా సర్పంచ్ సంయుక్తపై పవన్ ప్రశంసల వర్షం.. ఎందుకంటే..?

AP Deputy CM Pawan Kalyan Praises Karumanchi Samyukta: ఏపీకి చెందిన మైసూరివారిపల్లె గ్రామ సర్పంచ్ పై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ప్రస్తుతం ఏపీలో ఆ మహిళా సర్పంచ్ పేరు మారుమోగుతుంది. ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమెను ఎందుకు డిప్యూటీ సీఎం ప్రశంసించారు అనే వివరాలను తెలుసుకునేందుకు నెట్టింటా తెగ సెర్చ్ చేస్తున్నారంటా. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీలోని అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె సర్పంచ్ కారుమంచి సంయుక్తపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలంటేనే భయపడే సమయంలో సంయుక్త బరిలో నిలిచి విజయం సాధించారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసించారు.


Also Read: “చంద్రబాబు మాటలు విని షాకయ్యా.. మా హయాంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది”

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎన్నికల సమయంలో రోడ్లపైకి రావాలంటేనే అందరూ భయపడే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కూడా సంయుక్త పోటీలో నిలబడి విజయం సాధించారు. మిలిటరీలో పనిచేసిన భర్తను కోల్పోయి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే సంయుక్త ఆశయం. నిజంగా అది నా గుండెను కదిలించింది. సంయుక్త పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలంటూ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. సర్పంచ్ ఎన్నికల్లో ఆమె గెలిచాక నాకు చాలా ఆనందం వేసింది. అందుకే ఆమెను అభినందిస్తున్నా’ అంటూ ఆయన పేర్కొన్నారు.


Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×