BigTV English

Actress Hema:హేమకు రిలీఫ్.. మా సస్పెన్షన్ ఎత్తివేత

Actress Hema:హేమకు రిలీఫ్.. మా సస్పెన్షన్ ఎత్తివేత

Actress Hema: డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట లభించింది. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ అడ్డంగా దొరికిపోయిన  విషయం తెల్సిందే.  అయితే   తాను ఏ తప్పు చేయలేదని, డ్రగ్స్ తీసుకోలేదని హేమ చెప్తూ వచ్చింది. ఫార్మ్ హౌస్ లో ఉన్నానని, ఇంట్లో బిర్యానీ చేస్తున్నా అని వీడియోలు పెట్టుకొచ్చింది. హేమను ఎంతమంది విమర్శించినా.. మంచు విష్ణు ఒక్కడే ఆమెకు సపోర్ట్ గా నిలబడ్డాడు.


మా ప్రెసిడెంట్ మంచు విష్ణు.. హేమకు సపోర్ట్ గా  నిలబడుతూ.. ఒక మహిళపై ఇలాంటి నిందలు వేయడం మంచిది కాదని చెప్పుకొచ్చాడు.   పోలీసులు ఆధారాలతో హేమ తప్పు చేసిందని నిరూపిస్తే చర్యలు తీసుకుంటామని, అప్పటివరకు ఆమె తప్పు చేసిందని అనుకోవడం పద్ధతి కాదని తెలుపుతూ ఒక ప్రకటన చేశాడు. దాని తరువాత  పోలీసులు.. హేమకు వ్యతిరేకంగా ఆధారాలను చూపించి ఆమెను అరెస్ట్ చేశారు.

ఇక చేసేదిలేక.. మంచు విష్ణు, మా అసోసియేషన్ లో హేమ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశాడు. హేమకు క్లిన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ అమలు అవుతుందని తెలిపాడు. ఇక కొద్దిరోజులు మౌనం తరువాత హేమ..  ఈ మధ్యనే ఒక వీడియో విడుదల చేసిన విషయం తెల్సిందే. తాను అన్ని టెస్టులు చేయించుకున్నానని, అన్నింటిలో నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయని, కొందరు తనను బెదిరించి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.


ఇక తన రిపోర్ట్స్ ను, ఇంకొన్ని ఆధారాలను జోడించి మంచు విష్ణుకు పంపింది. అవన్నీ మా కమిటీ పరిశీలనలోకి తీసుకొని హేమ  సస్పెన్షన్ ను ఎత్తివేసింది.  మా  కమిటీ అధికారికంగా హేమపై వేసిన సస్పెన్షన్ ను ఎత్తివేసినట్లు ప్రకటన రిలీజ్ చేసింది. అయితే దీంతో పాటు ఒక కండీషన్ కూడా పెట్టింది.  మీడియాతో హేమ మాట్లాడకూడదని తెలిపింది.

సస్పెన్షన్ ఎత్తివేతతో హేమకు భారీ ఊరట  లభించింది. ఇకనుంచి హేమ.. అవకాశాలు వస్తే సినిమాల్లో నటించవచ్చు. మరి  హేమ ఈ కేసును మర్చిపోయి సినిమాలు చేస్తుందో .. లేక తనపై పడిన నిందలు నిజం కాదని నిరూపించడానికి పోరాడుతుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×