OTT Movie : ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు, అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే వీటిలో జంతువులు, మనుషుల మధ్య జరిగే ఫైటింగ్ సీన్స్ తో వచ్చే సినిమాలు చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ ఒక ద్వీపంలో జరుగుతుంది. అక్కడ రాకాసి కుక్కలతో కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పోరాడాల్సి వస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వవివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
వైలెట్ అనే యువతి, ప్రపంచంలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో కలిసి ఒక ప్రైవేట్ ద్వీపంలో విహారయాత్రకు ఆహ్వానం అందుకుంటుంది. ఈ ద్వీపం విన్స్ వెంచురా అనే ధనవంతుడి ఆధీనంలో ఉంటుంది. దీనిని అతను ‘విన్స్‌టోపియా’అని పిలుస్తుంటాడు. వైలెట్, ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్‌లు (వర్జీనియా గార్డనర్, రీలీ డౌన్స్, జాక్ స్టీనర్, పేజ్ కెన్నెడీ, ట్రాయ్ జెంటైల్) ఈ యాత్ర సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ అవుతుందని భావిస్తారు. విన్స్ ఈ ద్వీపంలో ఒక పోటీని ఏర్పాటు చేస్తాడు. ఇందులో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ద్వీపంలో వదిలివేయబడిన కుక్కలను పట్టుకోవాల్సిఉంటుంది.గెలిచిన వాళ్ళకు ఈ ద్వీపం సొంతమని విన్స్ ప్రకటిస్తాడు.
అయితే 13 సంవత్సరాల క్రితం ఈ ద్వీపంలో ఒక సంఘటన జరిగి ఉంటుంది. ఒక సినిమా షూటింగ్ సమయంలో కుక్కలు రాబిస్‌తో బాధపడి, వాళ్ళ యాజమానులను చంపి ద్వీపంలో అడవి జంతువులుగా మారాయని తెలుస్తుంది. ఈ కుక్కలు ఇప్పుడు మానవులపై దాడి చేసే రాక్షస జన్యువులతో కూడిన జాతిగా మారి ఉంటాయి. ఈ క్రమంలో విన్స్ సహా కొందరు ఈ కుక్కల దాడుల్లో చనిపోతారు, మిగిలిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బతకడానికి పోరాడాల్సి వస్తుంది. చివరికి ఈ ద్వీపంలో ఎంత మంది బతుకుతారు ? ఈ కుక్కలను ఎవరైనా అంతం చేస్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఐఎండీబీలో 7.9 రేటింగ్ ఉన్న కన్నడ మూవీ… కిక్ ఇచ్చే సీట్ ఎడ్జ్ పారాసైకలాజికల్ థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఈ హారర్ కామెడీ మూవీ పేరు ‘ఎ బ్రీడ్ అపార్ట్’ (A Breed Apart). 2025 లో వచ్చిన ఈ సినిమాకు ది ఫుర్స్ట్ బ్రదర్స్ దర్శకత్వం వహించారు. ఇది 2006లో వెస్ క్రావెన్ నిర్మించిన ‘The Breed’ సినిమాకు సీక్వెల్ గా రూపొందింది. ఈ సినిమా స్టోరీ ఒక నిర్మానుష్యమైన ద్వీపంలో జరుగుతుంది. ఇక్కడ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల గుండెల్లో భయం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టివి (Apple TV) లలో అందుబాటులో ఉంది.