E-Paper
Advertisement

గోదావరి జిల్లాలో దంచికొడుతున్న వర్షం.. వరదలో చిక్కుకు పోయిన ఎన్నికల సిబ్బంది!

గోదావరి జిల్లాలో దంచికొడుతున్న వర్షం.. వరదలో చిక్కుకు పోయిన ఎన్నికల సిబ్బంది!
Advertisement

Polling Staff: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులకు వెళ్తున్న పోలింగ్ అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోకముందే మార్కెట్ యార్డులో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి నీటిలోనే చిక్కుకుపోయారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నందున భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి ఉద్ధృతంగా వరద నీరు వచ్చి చేరింది.

వరద ఉదృతి..

అయితే గోపాలపురం మార్కెట్ యార్డులో వరద ఉధృతి పెరగడంతో వాహనాలు ఆగిపోవడం, చుట్టూ భారీగా వరద ప్రవాహం చేరడంతో ముందూ వెనక్కూ వెళ్లలేక ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ వద్ద ఉన్న అత్యంత విలువైన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి వర్షపు నీటిలో తడవకుండా కాపాడుకునేందుకు పోలింగ్ బృందాలు నానా అవస్థలు పడుతున్నాయి. నీటిమట్టం క్షణక్షణానికీ అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎన్నికల అధికారులు ఎదురుచూస్తున్నారు.

వరద హెచ్చరికలు..

Advertisement

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంకు వరద హెచ్చరికలను అధికారులు జారీ చేసారు. దీంతో పెదవాగు నుంచి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వేలేరుపాడు మండల పరధిలోని ముంపు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలన్నారు. ఇందు కోస్ం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు క్లారిటీ ఇచ్చారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు.

Also Read: పంజాబ్ కింగ్స్ లోకి వ‌స్తే హార్దిక్ పాండ్యా కెరీర్ సంక‌నాకిపోవ‌డం గ్యారెంటీ

Tags

Related News

బిగ్ టీవీ ఎఫెక్ట్.. కోనసీమ వరద బాధితులకు చేరిన సాయం!

పరిషత్ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ ల‌క్ష్యం.. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్

పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్.. మూడు మండలాలు మాత్రమే, షెడ్యూల్ ప్రకారమే..

తిరుపతి కార్పొరేషన్‌లో బీజేపీకి షాక్.. ఓడిపోయిన జిల్లా, నగర అధ్యక్షులు!

పార్టీల మద్దతు ఉంటే సరిపోదు భయ్యా.. క్షేత్రస్థాయిలో ఏబీవీ ఎక్కడ విఫలమయ్యారంటే?

బెజవాడ బాద్‌షా వంగవీటి రాధా.. రికార్డు మెజారిటీతో మేయర్ పీఠం కైవసం!

ఎన్నికల ఫలితాలపై విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్.. అధికార పార్టీలో భయం మొదలైంది

Big Stories

Advertisement
×