Ambajipeta Floods: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం గంగలకురు మెట్ల కాలనీలో తుఫాన్ కారణంగా ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరాయి. దీంతొ గత రెండు రోజులుగా వర్షపునీటిలోనే కాలనీవాసులు కాలం గడుపుతున్నారు. దీంతో ఈ కాలనీకి బిగ్ టీవీ అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి కవరేజ్‌కి వెళ్ళగా ఆ కాలనీవాసులు మాకు నీళ్లు అన్నము పెట్టించండి మహాప్రభో అంటూ దీనంగా అర్జించారు అక్కడి కాలనీ ప్రజలు.
అయితే బిగ్ టీవీ ఈ విషయాన్ని అధికారులకు దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో ఈ వార్త విన్న అక్కడి స్థానిక అంబాజీపేట జనసేన నాయకుడు మహిపాల్ తాతాజీ బిగ్ టీవీ కథనానికి స్పందించారు. వెంటనే అంబాజీపేట జనసేన నాయకులు దృష్టికి తీసుకు వెళ్లి బిగ్ టివి ప్రతినిధులతో మాట్లాడి వారికి భోజనాలు ఏర్పాటు చేసి వారి ఆకలి తీర్చారు. దీంతో కాలనీవాసులు బిగ్ టివికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు.
అదేవిధంగా జనసైనికులు బిగ్ టీవీకి యాజమాన్యానికి ధన్యవాదాలు ఇటువంటి వార్తను వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేసినందుకు మరో మారు బిగ్ టివి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీలో గత రెండు రోజుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ ప్రజలు వారి రోజూవారి పనులు చేసుకోకుండా ఇబ్బందులు పడుతుండటంతో వరదలో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో బిగ్ టీవీ కవరేజ్‌తో వారి ఆకలి తీర్చినందుకు అక్కడి స్థానికులు, జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. మూడు మండలాలు మాత్రమే, షెడ్యూల్ ప్రకారమే..