BigTV English

Mega158 : పోస్టర్ లోనే విధ్వంసం, భారీ యాక్షన్ ప్లాన్ చేసిన బాబీ

Mega158 : పోస్టర్ లోనే విధ్వంసం, భారీ యాక్షన్ ప్లాన్ చేసిన బాబీ

Mega158 : ఖైదీ నెంబర్ 150 సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఇది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.


ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 157 వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ విడుదల చేశారు. ఈ గ్లిమ్స్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది, మెగాస్టార్ అభిమానులు ఎటువంటి మెగాస్టార్ ని చూడాలనుకున్నారో అటువంటి మెగాస్టార్ ని ప్రజెంట్ చేశాడు అనిల్ రావిపూడి.

పోస్టర్ లోనే విధ్వంసం


మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా అంటే వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోని మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన స్టోరీ కూడా డిజైన్ చేశాడు బాబీ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అందుకే మరోసారి బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఇది మెగాస్టార్ కెరియర్ లో వస్తున్న 158 వ సినిమా, ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ పోస్టల్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ పోస్టర్లో ఒక గొడ్డలి కనిపిస్తుంది. నా గొడ్డలి పైన ধ্বংস আসছে। అని రాసి ఉంది. దీనికి అర్థం విధ్వంసం వస్తోంది అని. పోస్టర్ తోనే తన సినిమాకు సంబంధించిన హైప్ క్రియేట్ చేశాడు.

భారీ యాక్షన్ 

బాబీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అంటే వాల్తేరు వీరయ్య. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా ఒక భారీ యాక్షన్ సినిమాగా రాబోతున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే అర్థమయిపోయింది. డాకు మహారాజ్ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు బాబి. అప్పుడు కూడా ఫస్ట్ గొడ్డలితోపాటు బాలయ్య బ్రాండ్ ఆల్కహాల్ కూడా చూపించాడు. ఫ్యాన్స్ ఏ అంశాలను ఇష్టపడతారో వాటిపైన బాబీకి కూడా ఒక రకమైన క్లారిటీ ఉంది.

Also Read: తెలుగు నటరస నవరాజా శంకరుడే ఈ చిరంజీవుడు

Related News

Vijay Devarakonda: మేమంతా సేఫ్..కారు ప్రమాదం పై స్పందించిన విజయ్ దేవరకొండ

Pawan Kalyan: పవన్ తో దిల్ రాజు కొత్త సినిమా..రంగంలోకి క్రేజీ డైరెక్టర్!

Vijay Devarakonda: బ్రేకింగ్ – విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం

Dacoit Release: అడవి శేష్ డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్..వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ!

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

Upasana -Klin Kaara: క్లిన్ కారాను అందుకే చూపించలేదు.. ఆ భయమే కారణమా?

Nagachaitanya: నాగచైతన్య ఫెవరేట్ సినిమాలు.. ఒక్కో మూవీ 100 సార్లు చూశాడట

Saiyami Kher : అరుదైన గౌరవాన్ని అందుకున్న జాట్ బ్యూటీ.. గ్రేట్ మేడం!

Big Stories

×