BigTV English

AP EAPCET 2024 Counselling 2024: ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌కు 1.23 లక్షల మంది..16న సీట్ల కేటాయింపు!

AP EAPCET 2024 Counselling 2024: ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌కు 1.23 లక్షల మంది..16న సీట్ల కేటాయింపు!

AP EAPCET 2024 Counselling 2024: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌లో కోర్సులు, కళాశాలల ఎంపికకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసింది. శుక్రవారం రాత్రి వరకు మొత్తం 1.23 లక్షల మంది వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.


వెబ్ ఆప్షన్ల నమోదు కోసం జులై 8 నుంచి జులై 12 వరకు అవకాశం కల్పించారు. అయితే వెబ్ ఆప్షన్లను మార్చుకునేందుకు జులై 13న అవకాశం కల్పించారు. ఈ మేరకు నేటి అర్ధరాత్రి వరకు ఆప్షన్లకు మార్పు చేసుకునేందుకు ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా అంతకుముందు ఆప్షన్లను మార్పు చేసుకోవడంతోపాటు కొత్త ఆప్షన్లను కూడా పెట్టుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా..ప్రైవేట్ కాలేజీల ఫీజులు, అనుమతుల జారీలో వెబ్ ఆప్షన్ల నమోదు ఆలస్యమైంది. దీంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీల సమాచారం సైతం ఆలస్యంగానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొంది. చివరికి ఫీజుల విషయంపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల నమోదును యధావిధిగా నిర్వహించారు.


జులై 16న సీట్ల కేటాయింపు ఉండగా.. జులై 17 నుంచి 22 వరకు విద్యార్థులకు అలాట్ చేసిన కాలేజీల్లో ప్రవేశం పొందాల్సి ఉంటుంది. అనంతరం జులై 19 నుంచి కాలేజీల్లో తరగతులు నిర్వహించనున్నారు.

అంతకుముందు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. ఈ ఫీజులు 2026-27 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో మొత్తం పది వర్సిటీలకు కొత్త ఫీజులు ఖరారయ్యాయి. ఇందులో తొమ్మిది వర్సిటీల్లో ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి.

Tags

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×