BigTV English

Insurance Policy Tips: ఆరోగ్య బీమా ఎందుకు తీసుకోవాలి.. లేదంటే జీవితంలో ఏం జరుగుతుంది!

Insurance Policy Tips: ఆరోగ్య బీమా ఎందుకు తీసుకోవాలి.. లేదంటే జీవితంలో ఏం జరుగుతుంది!

Insurance Policy Tips: మనలో చాలా మంది తమ ఖర్చుల భారాన్ని మోస్తూ కుటుంబాన్ని నడుపుతున్నారు. కొందరికి భాద్యతలుంటే మరికొందరు భవిష్యత్తులో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ ఖర్చుల మధ్య కొన్న వస్తువులకు భద్రత కూడా అవసరం. తరువాత అవి అర్థికంగా సహాయపడతాయి. వీటిలో ఒకటి బీమాను కలిగి ఉంటుంది. ఫోన్, వాహనం, ఇల్లు, ఆరోగ్యం, జీవితానికి అనేక రకాల బీమాలు ఉన్నాయి.


వీటిలో ఆరోగ్య బీమా లేదా జీవిత బీమా కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీరు సరైన బీమాను ఎంచుకోవడంతో పాటు సరైన వయసులో బీమాను పొందడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో బీమాను ఏ వయసులో తీసుకోవాలి? ఆరోగ్య బీమా ఎలా ఉపయోగపడుతుంది. వీటన్నంటి గురించి వివరంగా తెలుసుకుందాం. బీమాను చాలా మంది తీసుకుంటారు కానీ, ఆ బీమా అప్‌డేట్ చేయడం లేదా మార్పులు చేయడం సరికాదు. మీ వయసు పెరిగే కొద్ది బీమాలో ఉండే కవరేజీ, ఇతర విషయాల గురించి మీరు తెలుసుకోవాలి. వయసుతో పాటు అవసరాలు మారుతాయి. ఈ అవసరాలతో పాటు బీమా ప్రయోజనాలను యాడ్ చేయడం అవసరం.

Also Read: Hero Next-Gen Xpulse: ఎన్‌ఫీల్డ్‌తో యుద్ధానికి సిద్ధమైన హీరో.. ఆ బైక్ కొత్త ఇంజన్‌తో వస్తుంది!


సరైన వయసులో బీమా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను పొందుతారు. సాధరణంగా యువత 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో పనిచేయడం ప్రారంభిస్తారు. ఈ వయసులో వారికి పెద్దగా బాధ్యతలు ఏమి ఉండవు. కానీ ఆర్థికభారం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీమాను తీసుకోవడం తెలివైన పని. ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, జీవిత బీమా వంటి వాటిని తీసుకోవడం ఉత్తమం. మీరు డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉండినట్లయితే టర్మ్ ప్లాన్‌తో పాటు బీమా చేయడం చాలా ముఖ్యం.

25 సంవత్సరాల తర్వాత జీవితంలో చాలా మార్పులు మొదలవుతాయి. సాధరణంగా 25 నుంచి 40 సంవత్సరాల వయసు గలవారిని అనేక బాధ్యతలు చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, చదువు. ఈ బాధ్యతలన్నీ ఈ వయసులోనే జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా కలిగి ఉండటం అవసరం. ఈ బీమా మీకు మాత్రమే కాదు. మీ కుటుంబ సభ్యులకు సంబంధించినది. మీరు ఇప్పటికే బీమాను కలిగి ఉండినట్లయితే. మీ భాగస్వామిని, కుటుంబ సభ్యులను అందులో చేర్చాలి. ఇంటి యాజమాని బీమాను కలిగ ఉండట ఎంతో ముఖ్యం.

Also Read: Cheapest Recharge Plans: సిమ్ ఫోర్ట్‌కు చెక్.. చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు.. 28 రోజుల వాలిడిటీ!

సాధరణంగా 20 నుంచి 40 సంవత్సరాల వయసు ఏధో ఒక విధంగా దాటుతుంది. నిజానికి ఖర్చులు, బాధ్యతలు 45 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రారంభమవుతాయి. పిల్లల ఉన్నత చదువులు, కొడుకు, కూతుళ్ల పెళ్లిళ్లు, అనారోగ్యం, ఇతరత్రా పెద్ద ఖర్చులు మొదలవుతాయి. ఈ కాలంలో టర్మ్ బీమాను కొనసాగించడం చాలా ముఖ్యం. బీమాతో పాటు, మీ వృద్ధాప్యంలో మీకు ఆర్థిక సహాయం అందించే భవిష్యత్తులో మీరు మంచి రాబడిని పొందగలిగే పెన్షన్ ప్లాన్ లేదా పెన్షన్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించండి.

Related News

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Big Stories

×