BigTV English

Dancer Jaanu Video: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన జానూ, వైరల్ వీడియో

Dancer Jaanu Video: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన జానూ, వైరల్ వీడియో

Youtuber Jaanu Dhee Show Special 2 Performance Viral:బుల్లితెర కనిపించిందంటే చాలు ఇంట్లో సందడి నెలకొంటుంది. అంతేకాదు ఇందులో రోజూ సందడి చేసే సినిమాలు, సీరియల్స్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఇక మధ్య మధ్యలో వచ్చే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కామెడీ ప్రోగ్రామ్స్,ఇలా చాలా ప్రోగ్రామ్స్ మనల్ని సందడి చేస్తుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మన వాళ్లు కామెడీ, డ్యాన్స్ ప్రోగ్రాంలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. ఎందుకంటే అందులో డ్యాన్స్ మాస్టర్స్‌ సందడి వేరే లెవల్‌ అనే చెప్పాలి.వారు డ్యాన్స్‌ కోసం తెలుగు రాష్ట్రాలలో కోట్లమంది అభిమానులు ఉన్నారు.


ఇందులో చాలామంది డ్యాన్సర్లు ఎన్నో ఏళ్లుగా తమ టాలెంట్‌తో ఆడియెన్స్ మనసును దోచుకుంటారు. అంతేకాకుండా ఢీ సీజన్ మారినప్పుడల్లా కొత్త వారిని ఢీ షో ద్వారా పరిచయం చేస్తూ ఉంటారు ఈ ప్రోగ్రాం యూనిట్. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్తగా ఈ ప్రోగ్రాంని డిజైన్ చేస్తుంటారు.తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్ ప్రోగ్రాం నడుస్తోంది.దీనికి హీరో నందు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు.ఇక కంటెస్టెంట్లులకు టీమ్ లీడర్లుగా జబర్ధస్త్ కమెడియన్ ఆది, శ్రీసత్య వ్యవహరిస్తున్నారు.ఈ షోకి జడ్జిలుగా శేఖర్ మాస్టర్,స్టార్ నటి హన్సిక,గణేష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్ షోకు ఫిదా అయిపోయాడు శేఖర్ మాస్టర్. అయితే ఈ మధ్యకాలంలో డ్యాన్స్ షోస్ అంటే ఆడియెన్స్‌లో విపరీతంగా నెగిటివిటీ పెరిగింది. ఎందుకంటే ఇందులో డ్యాన్స్ కంటే ఎక్కువగా రొమాన్స్ మాత్రమే కనిపిస్తుందన్న విమర్శలు ఉన్నాయి.

Also Read: రూ. 4 కోట్లు ఇస్తేనే ఆ పని చేస్తానంటున్న జాన్వీకపూర్‌


అంతేకాదు ఇది డ్యాన్స్ షో కాకుండా అదొక అడల్ట్ కామెడీ షో అయిందన్న విమర్శలు వినిపించాయి. డ్యాన్స్‌లో మూమెంట్స్ అస్సలు కనిపించడం లేదని, సర్కస్ ఫీట్స్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ అన్నింటికి చెక్ పెడుతూ కేవలం డ్యాన్సుతో జవాబు ఇచ్చింది కంటెస్టెంట్ జాను లిరి.ఢీ సెలబ్రిటీ స్పెషల్-2లో సెనిగ చేలా నిలబడి చేతులియ్యావే అంటూ సాగిపోయే ఫోక్ సాంగ్‌కు జాను అదిరిపోయే స్టెప్స్ వేస్తూ మరోసారి తన డ్యాన్స్‌ని అందరికి రుచి చూపించిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు తాను స్వతహాగా సోషల్ మీడియా లో తనకంటూ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. తన ఫోక్‌ సాంగ్‌తో తనకెవరు పోటీ, తనకు రారు పోటీ అన్నట్టుగా రెచ్చిపోతుంది. అంతేకాదు తాజాగా రిలీజ్ అయిన ఈ పాటకి ఇచ్చి పడేసింది.గతంలో కూడా యూట్యూబ్ వేదికగా ఈ పాటకు స్టెప్పులు వేసిన ఈవిడ, తాజాగా ఢీ షోలో కూడా తన పెర్ఫామెన్స్ తో ఢీ షోకే హైలైట్‌గా నిలిచింది.

ఇక జడ్జీలుగా ఉన్న శేఖర్ మాస్టర్,హీరోయిన్ హన్సిక, గణేష్ మాస్టర్ ఈమె డ్యాన్స్‌కి ఫిదా అయిపోయారు.సీట్లో కూర్చొని అటు ఇటు ఊగుతూ ఆనందంలో మునిగిపోయాడు.అంతేకాదు తన డ్యాన్స్ స్టెప్పులకి జానును ప్రశంసలతో ముంచెత్తాడు.జడ్జి చైర్‌లో కూర్చుని సాంగ్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసింది రెండు మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు.ఈ మధ్యకాలంలో ఇలా ఎంజాయ్ చేసింది లేదంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. తన డ్యాన్స్‌కు ఫ్లాట్ అయిపోయానంటూ మోకాళ్ల మీద పడి ఆమెకు సెల్యూట్ చేశాడు.టాలెంట్ ఎవరు,ఎక్కడ ఆపలేరు అంటూ ప్రశంసించాడు.ఇక గణేష్ మాస్టర్ మాటల్లేవ్ అంటూ విజిల్ వేసి ఆమె ఫెర్ఫామెన్స్ ఎలా ఉందో చెప్పకనే చెప్పాడు. ఇక హీరోయిన్ హన్సిక మాటల్లేవంటూ పేపర్లు చించేసి ఫ్లై కిస్‌లతో జానుకి గాల్లో ముద్దులు ఇచ్చింది. దీంతో ఆ సెట్‌లో ఉన్నవాళ్లంతా తన డ్యాన్స్‌కి మంత్రముగ్థులయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×