E-Paper
Advertisement

AP Elections 2024: త్వరలో ఏపీ ఎన్నికలు.. నేడు రాజకీయపార్టీలతో ఎలక్షన్ కమిటీ భేటీ

AP Elections 2024: త్వరలో ఏపీ ఎన్నికలు.. నేడు రాజకీయపార్టీలతో ఎలక్షన్ కమిటీ భేటీ
Advertisement

AP Elections 2024: ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉన్నందున్న అందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సీఈవో రాజ్‌కుమార్‌తోపాటు ఇతర ఎలక్షన్‌ అధికారులు కూడా రాష్ట్రానికి చేరుకున్నారు. మూడు రోజులపాటు ఈ కమిటీ ఎన్నికల పనులతో బిజీకానుంది. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనుంది.

ఎలక్షన్‌ ప్రక్రియలో భాగంగా నేడు అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల బృందం సమావేశం కానుంది. ఈ మేరకు ఇదివరకే పార్టీ నేతలందరికీ చర్చలతో ఆహ్వానం పంపింది. ఇక ఏపీలో ఓటర్ల అవకతవకలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫోకస్‌ పెట్టనుంది ఈసీ. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలు చోటు జరిగాయంటూ వైసీపీ, జనసేన, టీడీపీలు ఫిర్యాదు చేశాయి.

Advertisement

నేడు జరిగే సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ సందర్భంగా ఈసీ ఇచ్చే ఆదేశాలు కీలకం కానున్నాయి. ఈ సమావేశం అనంతరం రేపు ఈసీ ప్రత్యేక సమీక్ష నిర్వహించనుంది. ఇందులో ఇచ్చే ఆదేశాల ఆధారంగా సీఈవో చర్యలు తీసుకుంటారు. ఇక మరోవైపు సీఈసీ బృందానికి సీఈవో ముకేష్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్ధతపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. అదే రోజు ఓటర్ల జాబితాలో అవకతవకలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ సీఈసీని కలిసి మరో ఫిర్యాదు చేయనున్నారు.

.

Advertisement

.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×